బీఎస్ఎన్ఎల్‌కు రూ. 7,260 కోట్ల నష్టం
ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు లాభాల బాటలో పయనిస్తుంటే ప్రభుత్వం రంగం టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం వేల కోట్ల నష్టాలను మూట గట్టుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్‌కు రూ. 7,260 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. వైఎస్సార్ సీపీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గోకరాజు గంగరాజులు బుధవారం పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆర్థికంగా బీఎస్ఎన్ఎల్‌ను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, బీఎస్ఎన్ఎల్ […]
BY sarvi22 July 2015 1:06 PM GMT
X
sarvi Updated On: 23 July 2015 2:25 AM GMT
ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు లాభాల బాటలో పయనిస్తుంటే ప్రభుత్వం రంగం టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం వేల కోట్ల నష్టాలను మూట గట్టుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్‌కు రూ. 7,260 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. వైఎస్సార్ సీపీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గోకరాజు గంగరాజులు బుధవారం పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆర్థికంగా బీఎస్ఎన్ఎల్‌ను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, బీఎస్ఎన్ఎల్ సేవల్లో నాణ్యత పెంచేందుకు రూ. 4,804 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును రూపొందిస్తోందని ఆయన చెప్పారు.
Next Story