తిరుమలలో కొత్తజంటలకు వీఐపీ దర్శనం?
శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల్లో ఎక్కువ మంది వారి పిల్లలకు తిరుపతిలో వివాహం జరిపించాలని కోరుకుంటున్నారని, ఇటువంటి వారి కోసం తిరుపతిలో వివాహవేదిక నిర్మించాలని ప్రతిపాదించామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. విశాఖకు వచ్చిన ఆయన మాట్లాడుతూ వివాహం అనంతరం కొత్త దంపతులు, ఇరువైపుల తల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి తిరుమలలో వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలలో పొందుపరుస్తున్నామన్నారు. దీనికోసం త్వరలో తిరుపతిలో టూర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం చేయడంతోపాటు […]
BY sarvi21 July 2015 6:41 PM IST
X
sarvi Updated On: 22 July 2015 6:32 AM IST
శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల్లో ఎక్కువ మంది వారి పిల్లలకు తిరుపతిలో వివాహం జరిపించాలని కోరుకుంటున్నారని, ఇటువంటి వారి కోసం తిరుపతిలో వివాహవేదిక నిర్మించాలని ప్రతిపాదించామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. విశాఖకు వచ్చిన ఆయన మాట్లాడుతూ వివాహం అనంతరం కొత్త దంపతులు, ఇరువైపుల తల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి తిరుమలలో వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలలో పొందుపరుస్తున్నామన్నారు. దీనికోసం త్వరలో తిరుపతిలో టూర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం చేయడంతోపాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేస్తామన్నారు. దీనికి ప్రాంతాలవారీగా టూరిజం ప్రమోషన్ బ్యూరోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తొలుత విశాఖపట్నం నుంచే ప్రమోషన్ బ్యూరోలు ప్రారంభిస్తామన్నారు. నెల్లూరు, తిరుపతి, అనంతపురం….ఇలా ప్రతీ నోడ్‌లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక స్థలాలను కలుపుతూ అభివృద్ధి సాగిస్తామన్నారు. పర్యాటక విస్తరణలో భాగంగా అన్ని దేశాల నుంచి ఎయిర్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు.
Next Story