Telugu Global
Cinema & Entertainment

కాపీ కొట్టాడు.. కానీ క్రేజ్ రావట్లేదు

బాహుబలి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఏదైనా మూవీ వస్తుందంటే కచ్చితంగా బాహుబలి ప్రభావం ఆ సినిమాపై పడి తీరుతుంది. పైగా కాస్తోకూస్తో పోలికలున్న అదే తరహా సినిమా వస్తుందంటే అంచనాలు మరింత పెరుగుతాయి. అందుకే దర్శకుడు గుణశేఖర్ తన కొత్త సినిమా రుద్రమదేవి ప్రమోషన్ కోసం బాహుబలినే ఫాలో అయ్యాడు. కానీ క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు. బాహుబలి సినిమాను పోస్టర్ల ప్రచారంతో మొదలుపెట్టారు. సినిమాలో ఒక్కో పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రాజమౌళి దశలవారీగా […]

కాపీ కొట్టాడు.. కానీ క్రేజ్ రావట్లేదు
X
బాహుబలి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఏదైనా మూవీ వస్తుందంటే కచ్చితంగా బాహుబలి ప్రభావం ఆ సినిమాపై పడి తీరుతుంది. పైగా కాస్తోకూస్తో పోలికలున్న అదే తరహా సినిమా వస్తుందంటే అంచనాలు మరింత పెరుగుతాయి. అందుకే దర్శకుడు గుణశేఖర్ తన కొత్త సినిమా రుద్రమదేవి ప్రమోషన్ కోసం బాహుబలినే ఫాలో అయ్యాడు. కానీ క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు. బాహుబలి సినిమాను పోస్టర్ల ప్రచారంతో మొదలుపెట్టారు. సినిమాలో ఒక్కో పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రాజమౌళి దశలవారీగా విడుదలచేశాడు. వాటికి ఎక్కడాలేనంత పబ్లిసిటీ వచ్చింది. అదే పద్దతిని గుణశేఖర్ కూడా ఫాలో అవుతున్నాడు. ఒక్కో క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ పోస్టర్లు విడుదలచేస్తున్నాడు. కానీ రుద్రమదేవి ప్రమోషన్ ను ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఒకవైపు బాహుబలి సినిమా మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు శ్రీమంతుడు మేనియా షురూ అయింది. ఈ రెండుసినిమాల మధ్యలో రుద్రమదేవి ఇమడలేక, నలుగురి దృష్టిలో పడలేక సతమతమైపోతోంది. ఇప్పటికైనా గుణశేఖర్, తన సినిమా ప్రమోషన్ కోసం సరికొత్త పంథాలో, కొత్తదనంతో ముందుకెళ్తే ప్రేక్షకుల దృష్టిలో పడే అవకాశముంది.
First Published:  22 July 2015 1:00 AM IST
Next Story