తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహితను నిర్మించాలి: లెఫ్ట్
ప్రాణిహిత – చేవెళ్ల ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్దనే నిర్మించాలని, స్థలం మారిస్తే ప్రభుత్వంతో యుద్ధం తప్పదని వామపక్షాల రాష్ట్ర సదస్సులో నేతలు హెచ్చరించారు. ప్రాణిహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దే నిర్మించాలన్న డిమాండ్‌తో 10 వామపక్షపార్టీలు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సుకు హాజరైన వామపక్షనేతలు ప్రాణహిత చేవెళ్ల స్థలాన్ని మారిస్తే ఊరుకోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని అనుమతులు తీసుకొని […]
BY sarvi21 July 2015 6:36 PM IST
sarvi Updated On: 22 July 2015 5:12 AM IST
ప్రాణిహిత – చేవెళ్ల ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్దనే నిర్మించాలని, స్థలం మారిస్తే ప్రభుత్వంతో యుద్ధం తప్పదని వామపక్షాల రాష్ట్ర సదస్సులో నేతలు హెచ్చరించారు. ప్రాణిహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దే నిర్మించాలన్న డిమాండ్‌తో 10 వామపక్షపార్టీలు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సుకు హాజరైన వామపక్షనేతలు ప్రాణహిత చేవెళ్ల స్థలాన్ని మారిస్తే ఊరుకోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని అనుమతులు తీసుకొని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు ఇప్పుడు స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల డిజైన్లను డబ్బులు దోచుకోవడానికే మారుస్తున్నారని వారు ఆరోపించారు. తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం రెండు చోట్ల ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పడంలో కుట్ర దాగుందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ నేత జి.వినోద్ వామపక్ష నాయకులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీ జి.వెంకటస్వామి కోరినందువల్లనే అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల నిర్మాణానికి 2008లో శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఏడు ఇల్లాల్లోని 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన అన్నారు. వామపక్షాలు చేస్తున్న పోరాటానికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు.
Next Story