Telugu Global
Others

సింగ‌పూర్ బృందంతో బాబు ర‌హ‌స్య చ‌ర్చ‌లు..మంత్రుల కినుక‌

సీడ్ క్యాపిట‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ స‌మ‌ర్పించ‌డానికి సింగ‌పూర్ బృందం వ‌చ్చిన స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రుల‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. వారితో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మావేశ మందిరంలోకి మంత్రుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సింగపూర్‌ ప్రతినిధులు సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాను సమర్పించే సందర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అంత‌కుముందు చంద్ర‌బాబు సింగ‌పూర్ బృందంతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. రాజధాని కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులను కూడా బయటకు పంపించేశారు. మధ్యాహ్నం భోజనం అనంతరం […]

సింగ‌పూర్ బృందంతో బాబు ర‌హ‌స్య చ‌ర్చ‌లు..మంత్రుల కినుక‌
X
సీడ్ క్యాపిట‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ స‌మ‌ర్పించ‌డానికి సింగ‌పూర్ బృందం వ‌చ్చిన స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రుల‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. వారితో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మావేశ మందిరంలోకి మంత్రుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సింగపూర్‌ ప్రతినిధులు సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాను సమర్పించే సందర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అంత‌కుముందు చంద్ర‌బాబు సింగ‌పూర్ బృందంతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. రాజధాని కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులను కూడా బయటకు పంపించేశారు. మధ్యాహ్నం భోజనం అనంతరం వారికి అవకాశం కల్పించారు. హోటల్‌ షెల్టన్‌లో సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లానుపై రాష్ట్ర ప్రభుత్వానికి, సింగపూర్‌ ప్రతినిధులకు మధ్య చర్చ జరిగింది. ఉదయం 11.00 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హోటల్‌కు చేరుకోగా అనంతరం సింగపూర్‌ ప్రతినిధులు వచ్చారు. వారిని చంద్రబాబునాయుడు సాదరంగా ఆహ్వానించారు. హోటల్‌ ఆరో అంతస్తులోని సమావేశ మందిరంలో రాజధానిపై ప్రభుత్వానికి వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు, ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, సిద్ధా రాఘవరావు, ఎంపిలు మురళీమోహన్‌, గల్లా జయదేవ్‌ తదితరులు హాజరయ్యారు వారందరూ సమావేశ మందిరానికి వెళ్లారు. అయితే అక్కడ వారిని లోపలకు అనుమ‌తించ‌లేదు. గల్లా జయదేవ్‌ ఒక్కరినే లోపలకు పంపించారు. దీంతో చేసేదేమీలేక మిగిలిన మంత్రు లందరూ తిరిగి మొదటి అంతస్తుకు చేరుకున్నారు.
ఈ పరిణామానికి యనముల రామకృష్ణుడు షాక్ అయ్యారు. ఎన్టీరామారావును గద్దె దించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయ్యడంలో ప్రధాన పాత్ర అప్పటి శాసన సభా స్పీకర్ యనమల రామకృష్ణుడిదే. స్పీకర్ గా యనమల సహకరించకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమస్యే లేదు. బయటకు చెప్పుకోకపోయిన చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయటంలో ప్రధానపాత్ర తనదేనని యనమల విశ్వశిస్తాడు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో, ఆయన ప్రవర్తనలో కింగ్ మేకర్ నన్న భావన కనిపిస్తూ ఉంటుంది. అలాంటి యనమలకు ప్రవేశం లేకుండా గల్లా జయదేవ్ ను లోపలకు పిలవడంతో ఆయన షాక్ తిన్నారు.
రావెల కిషోర్‌బాబుకు సింగపూర్‌ ప్రతినిధులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చూసే బాధ్య‌త‌ అప్పగించారు. మంత్రి నారాయణకు రవాణా బాధ్యతలు అప్పగించారు. మధ్యాహ్నం బోజన సమయం అనంతరం మంత్రులను లోపలకు పంపించారు. అప్పటికి ఒక విడత చర్చలు పూర్తయ్యాయి. సమావేశంలో పాల్గొన్న మంత్రులెవరికీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన కనీస నివేదికలు కూడా ఇవ్వలేదు. తొలివిడ‌త చ‌ర్చ‌లేమిటో… అందులో గ‌ల్లా జ‌య‌దేవ్‌తో క‌ల‌సి సింగ‌పూర్ బృందంతో బాబు ఏం చ‌ర్చించి ఉంటార‌నేదానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఏది ఏమైనా త‌న కేబినెట్‌లోని మంత్రుల‌కు కూడా తెలియ‌ని ర‌హ‌స్యాలు ఏం ఉన్నా.. మంత్రుల‌ను అలా లోప‌లికి అనుమ‌తించ‌కుండా అవ‌మానించ‌డం మాత్రం గ‌తంలో ఎప్పుడూ క‌నీ విని ఎర‌గ‌మ‌ని అధికార‌వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
First Published:  21 July 2015 11:40 PM GMT
Next Story