జర నవ్వండి ప్లీజ్ 151
ప్రశ్న ప్రకాష్: మా స్కూల్ టీచర్ ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఎందుకని? వికాస్: బహుశా ఆమెకు ఆన్సర్స్ తెలీవేమో! ——————————————— సున్నా స్టూడెంట్: మేడం! నాకు జీరో మార్కులిచ్చారు నేను మరీ అంత చెత్తగా రాశానా? టీచర్: ఏంచెయ్యమంటావు? అంతకుమించి తక్కువ ఇచ్చే వీల్లేదు. ——————————————— టానిక్ తండ్రి: నువ్వీరోజు టానిక్ తాగావా? కొడుకు: లేదు తండ్రి: ఎందుకని? కొడుకు: మీరేకదా! లాఫర్ ఈజ్ ద బెస్ట్టానిక్ అన్నారు.. అందుకని నవ్వి ఊరుకున్నా! ——————————————— గురక […]
ప్రశ్న
ప్రకాష్: మా స్కూల్ టీచర్ ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఎందుకని?
వికాస్: బహుశా ఆమెకు ఆన్సర్స్ తెలీవేమో!
———————————————
సున్నా
స్టూడెంట్: మేడం! నాకు జీరో మార్కులిచ్చారు నేను మరీ అంత చెత్తగా రాశానా?
టీచర్: ఏంచెయ్యమంటావు? అంతకుమించి తక్కువ ఇచ్చే వీల్లేదు.
———————————————
టానిక్
తండ్రి: నువ్వీరోజు టానిక్ తాగావా?
కొడుకు: లేదు
తండ్రి: ఎందుకని?
కొడుకు: మీరేకదా! లాఫర్ ఈజ్ ద బెస్ట్టానిక్ అన్నారు.. అందుకని నవ్వి ఊరుకున్నా!
———————————————
గురక
పేషెంట్: నాకెంత గురక వస్తుందంటే దాని వల్ల నిద్రపోలేకపోతున్నాను
డాక్టర్: ఐతే వెళ్లి ఇంకో గదిలో పడుకోవచ్చు కదా!