తలసానిపై న్యాయ పోరాటం: జానా
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై న్యాయ పోరాటం చేస్తామని సీఎల్పీ నేత కె. జానారెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ సమ్మెకు మద్దతు తెలిపేందుకు ఖమ్మం వెళ్ళిన ఆయన మాట్లాడుతూ ‘పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం. అనైతికం. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’అన్నారు. తలసాని విషయంలో స్పీకర్ స్పష్టత ఇవ్వడంలేదని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ‘కొత్త రాష్ట్రంలో కొత్త స్పీకర్ మంచి పేరు తెచ్చుకుంటారని ఆశించాం. కానీ రాజీనామా లేఖ విషయంలో ఆయన ఎంతకీ స్పష్టత […]
BY sarvi22 July 2015 12:33 AM GMT
X
sarvi Updated On: 22 July 2015 12:49 AM GMT
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై న్యాయ పోరాటం చేస్తామని సీఎల్పీ నేత కె. జానారెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ సమ్మెకు మద్దతు తెలిపేందుకు ఖమ్మం వెళ్ళిన ఆయన మాట్లాడుతూ ‘పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం. అనైతికం. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’అన్నారు. తలసాని విషయంలో స్పీకర్ స్పష్టత ఇవ్వడంలేదని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ‘కొత్త రాష్ట్రంలో కొత్త స్పీకర్ మంచి పేరు తెచ్చుకుంటారని ఆశించాం. కానీ రాజీనామా లేఖ విషయంలో ఆయన ఎంతకీ స్పష్టత ఇవ్వడంలేదు. తలసాని రాజీనామా చేశానంటుండగా, అసెంబ్లీ సెక్రటరియేట్ మాత్రం రాజీనామా అందలేదని చెబుతోంది. గవర్నర్ కూడా స్పందించడంలేదు. కేసీఆర్ దీనిపై పెదవి విప్పడం లేదు. ఏమిటీ రాజకీయ డ్రామా? ఇది రాజ్యాంగ సమస్యగా మారుతోంది’అని ఆయన అన్నారు. సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. తలసాని విషయంలో సీఎం విలువలకు పాతరేశారని మండిపడ్డారు.
Next Story