2017 నాటికి అణువిద్యుత్‌లో మూడో స్థానంలో చైనా
ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిన చైనా 2017 నాటికి అణువిద్యుత్‌లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరనుంది. అమెరికా, ఫ్రాన్స్ ల తర్వాత ప్ర స్తుతం మూడో స్థానంలో ఉన్న జపాన్‌ను చైనా మరో రెండేళ్లలో అధిగమించనుంది. వాతవరణ మార్పులపై పోరాడాలని భావిస్తున్న చైనా పర్యావరణానికి హాని కలిగించని శిలాజయేతర ఇంధనాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. అందుకోసం 58 గిగావాట్ల న్యూక్లియర్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు 2020 నాటికి 30 గిగావాట్ల విద్యుత్ […]
BY sarvi21 July 2015 6:37 PM IST
sarvi Updated On: 22 July 2015 5:17 AM IST
ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిన చైనా 2017 నాటికి అణువిద్యుత్‌లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరనుంది. అమెరికా, ఫ్రాన్స్ ల తర్వాత ప్ర స్తుతం మూడో స్థానంలో ఉన్న జపాన్‌ను చైనా మరో రెండేళ్లలో అధిగమించనుంది. వాతవరణ మార్పులపై పోరాడాలని భావిస్తున్న చైనా పర్యావరణానికి హాని కలిగించని శిలాజయేతర ఇంధనాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. అందుకోసం 58 గిగావాట్ల న్యూక్లియర్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు 2020 నాటికి 30 గిగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తోందని ఎనర్జీ ఇన్‌ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఇఐఎ) తెలిపింది. ప్రస్తుతం చైనా అణువిద్యుత్ సామర్థ్యం 23 గిగావాట్లని ఇఐఎ తెలిపింది.
Next Story