Telugu Global
National

ఆధార్‌ను రద్దు చేయలేం: సుప్రీంకు తెలిపిన కేంద్రం

దేశంలోని ప్రతి పౌరుడికీ వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను ఇచ్చేందుకు ప్రారంభించిన ఆధార్ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేయటం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.5,000 కోట్లు ఖర్చు చేశామని, 120 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి గుర్తింపు కార్డులిచ్చామని పేర్కొంది. ఈ సమయంలో ప్రాజెక్టును రద్దు చేయటం కుదరదని అటార్నీ జనరల్ ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టుకు విన్నవించారు. సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదంటూ 2013లో […]

ఆధార్‌ను రద్దు చేయలేం: సుప్రీంకు తెలిపిన కేంద్రం
X
దేశంలోని ప్రతి పౌరుడికీ వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను ఇచ్చేందుకు ప్రారంభించిన ఆధార్ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేయటం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.5,000 కోట్లు ఖర్చు చేశామని, 120 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి గుర్తింపు కార్డులిచ్చామని పేర్కొంది. ఈ సమయంలో ప్రాజెక్టును రద్దు చేయటం కుదరదని అటార్నీ జనరల్ ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టుకు విన్నవించారు. సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదంటూ 2013లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం దాఖలుచేసిన అప్పీల్‌పై మంగళవారం విచారణ జరిగింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీచేయాలని రోహత్గీ విజ్ఞప్తి చేశారు.
First Published:  22 July 2015 1:32 AM GMT
Next Story