Telugu Global
Others

భారత్‌లోనే నెంబర్ వన్ మ‌న‌మే: చందబ్రాబు

తెలుగు జాతి తలచుకుంటే ఆంద్రప్రదేశ్‌ను భారత్‌లోనే అగ్రగామిగా నిలపగలదని, అలాంటి శక్తిసామర్ధ్యాలు మనవాళ్ళకు ఉన్నాయని ఏపీ సీఎం చందబ్రాబు నాయుడు అన్నా‌రు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలికాభివృద్ధి అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తయారు చేస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు ఏపికి పెట్టుబడులతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి దరఖాస్తు చేసిన 21 రోజుల్లో అన్ని అనుమతులూ […]

తెలుగు జాతి తలచుకుంటే ఆంద్రప్రదేశ్‌ను భారత్‌లోనే అగ్రగామిగా నిలపగలదని, అలాంటి శక్తిసామర్ధ్యాలు మనవాళ్ళకు ఉన్నాయని ఏపీ సీఎం చందబ్రాబు నాయుడు అన్నా‌రు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలికాభివృద్ధి అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తయారు చేస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు ఏపికి పెట్టుబడులతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి దరఖాస్తు చేసిన 21 రోజుల్లో అన్ని అనుమతులూ ఇస్తామన్నారు. రహదారులు, అవసరమైతే విద్యుత్‌ యూనిట్‌ ధర తగ్గించే విషయాన్ని పరిశీలిస్తా మన్నారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖలలో పోర్టులున్నందున ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన భూ మిని తక్కువ ధరకు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో చేపల పరిశ్రమ పదిరెట్లు అభివృద్ధి చెందే అవకాశముందన్నారు. అరకు, పాడేరు కాఫీ పంటకు, పామాయిల్‌, మినప, పత్తి వంటి వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో డెయిరీ, పౌల్ట్రీ, ఇటుకలు, ఆటోమొబైల్‌ వంటి అనేక పరిశ్రమలు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే హోండా మోటార్స్‌, ఇసుజి కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఫైబర్‌ కనెక్టివిటీ అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. రూ.350 కోట్లతో గ్రామంలోని ప్రతి ఇంటికీ రూ.100కే డిజిటల్‌ నెట్‌వర్క్‌ అందిస్తామన్నారు. ఈ సదుపాయం అన్ని గ్రామాలకూ విస్తరిస్తామని తెలిపారు. డిసెంబర్‌ లేదా మార్చిలోగా ఇది పూర్తి చేస్తామన్నారు. మొదట్నుంచీ తనకు సింగపూర్‌తో మంచి సంబంధాలున్నాయని, నీతికీ, స్నేహానికీ సింగపూర్‌ ప్రజలు అత్యధిక ప్రాముఖ్యం ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా తాను సింగపూర్‌ ప్రభుత్వాన్ని కోరినప్పుడు వారు ఎంతో ఆనందంగా ముందుకొచ్చారన్నారు.
First Published:  22 July 2015 1:35 AM IST
Next Story