మాజీ ఎమ్మెల్యే విష్ణుపై 420 కేసు
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఆయన అనుచరులపై ఫోర్జరీ కేసు నమోదైంది. దోమలగూడ గగన్ మహల్ రోడ్డులో విమల కార్వాండే అనే మహిళకు 786 గజాల భూమి ఉంది. గతంలో ఆమెకొంతకాలం పాటు అమెరికాలో ఉంటున్న కుమారుల వద్దకు వెళ్లింది. ఇటీవల ఆ స్థలాన్ని విమల కుమారులు డెవలప్‌మెంట్‌కు ఓ బిల్డర్‌కు ఇచ్చారు. ఆ భూమిలో పనులుమొదలు పెట్టగానే ఎమ్మెల్యే విష్ణు ఈ భూమిని విమల కార్వాండే తమకు విక్రయించారని పత్రాలు చూపించి అడ్డుకున్నారు. ఈ మేరకు […]
BY sarvi22 July 2015 5:55 AM IST
X
sarvi Updated On: 22 July 2015 6:01 AM IST
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఆయన అనుచరులపై ఫోర్జరీ కేసు నమోదైంది. దోమలగూడ గగన్ మహల్ రోడ్డులో విమల కార్వాండే అనే మహిళకు 786 గజాల భూమి ఉంది. గతంలో ఆమెకొంతకాలం పాటు అమెరికాలో ఉంటున్న కుమారుల వద్దకు వెళ్లింది. ఇటీవల ఆ స్థలాన్ని విమల కుమారులు డెవలప్‌మెంట్‌కు ఓ బిల్డర్‌కు ఇచ్చారు. ఆ భూమిలో పనులుమొదలు పెట్టగానే ఎమ్మెల్యే విష్ణు ఈ భూమిని విమల కార్వాండే తమకు విక్రయించారని పత్రాలు చూపించి అడ్డుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఆయన అనుచరులు కలిసి హైకోర్టులో కేసు కూడా వేశారు. అయితే భూమిని విక్రయించినట్లుగా చెబుతున్న తేదీల్లో విమల కార్వాండే అమెరికాలో ఉండటంతో అవి నకిలీవని తేలింది. దీంతో విమల కుమారుడు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఆయన అనుచరులపై 420 తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
Next Story