నేటి నుంచి జగన్ మూడోవిడత రైతు భరోసా యాత్ర
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేటి నుంచి అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఆయా గ్రామాల్లో రచ్చబండ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. మొదటి రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరులో […]
BY sarvi21 July 2015 12:59 AM IST
X
sarvi Updated On: 21 July 2015 5:57 AM IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేటి నుంచి అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఆయా గ్రామాల్లో రచ్చబండ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. మొదటి రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి కైరేవు గ్రామానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. 22వ తేదీన ముదిగళ్లు, వర్లి తదితర గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలుసుకుంటారు. 23 వ తేదీన కంబదూరు మండల కేంద్రం మీదుగా తిమ్మాపురం, వంటారెడ్డిపల్లి గ్రామాల్లో భరోసా యాత్ర సాగుతుంది. 24 వ తేదీ నుంచి పెనుగొండ, మడకశిర నియోజక వర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఇంతకు ముందు రెండు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారిలో ఆత్మస్థైర్యం కలిగించారు. రైతుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.
Next Story