Telugu Global
Others

సింగపూర్‌కు ఏపీ తాకట్టు?: తులసిరెడ్డి

రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సింగపూర్‌కు తాకట్టు పెడుతున్నారని మాజీ ఎంపి ఎన్‌.తులసిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అసలు రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకో అర్ధంకావడం లేదని అన్నారు. ప్రపంచంలో లక్షల ఎకరాల్లో ఏ రాజధాని నిర్మాణం జరగలేదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకే రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాలు సేకరిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సింగపూర్‌కు, సింగపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు […]

సింగపూర్‌కు ఏపీ తాకట్టు?: తులసిరెడ్డి
X

రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సింగపూర్‌కు తాకట్టు పెడుతున్నారని మాజీ ఎంపి ఎన్‌.తులసిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అసలు రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకో అర్ధంకావడం లేదని అన్నారు. ప్రపంచంలో లక్షల ఎకరాల్లో ఏ రాజధాని నిర్మాణం జరగలేదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకే రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాలు సేకరిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సింగపూర్‌కు, సింగపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అనేక ధఫాలుగా ముఖ్యమంత్రి ప్రయాణాలు చేయడం, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ను రాజమండ్రికి పిలిపించుకోవడం చూస్తుంటే రాష్ట్రాన్ని సింగపూర్‌కు తాకట్టుపెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రాజధానికి కావలసిన రాజ్‌భవన్‌, కౌన్సిల్‌ హాల్‌, సచివాలయం, అసెంబ్లీ, రాష్ట్రపతి భవన్‌, డైరెక్టరేట్స్‌, సిబ్బంది గృహాలకు సుమారు వెయ్యి ఎకరాలు సరిపోతుందని, కానీ ముఖ్యమంత్రి మాత్రం వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో డీ-గ్రేడ్‌ ఫారెస్ట్‌కు ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలని ఉంటే దానికి అనుగుణంగా డీ-గ్రేడ్‌ పారెస్ట్‌ల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అలాంటప్పుడు వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక సంస్థలు మన దేశంలోనే ఉంటే… సింగపూర్‌కే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని నిలదీశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చులో సింగపూర్‌ ప్రభుత్వం 75 శాతం భరిస్తుందని చంద్రబాబు చెబుతున్నారని, దీని వెనుక మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. లాభాపేక్ష లేకుండా ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెడతారని ఆయన అన్నారు. మొత్తం రాజధాని వ్యవహారం చూస్తుంటే సింగపూర్‌కు ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెడుతున్నట్టే కనిపిస్తోందని ఆయన అన్నారు.

First Published:  21 July 2015 7:29 AM IST
Next Story