Telugu Global
NEWS

రాజ్‌భవన్‌ వద్ద టీటీడీపీ ధర్నా... అరెస్ట్‌లు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మంత్రి తలసాని వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేయకుండా రాజ్యాంగ విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తన పదవికి రాజీనామా చేశానని చెప్పి మోసం చేసిన తలసాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్‌ నరసింహన్‌ సరిగా స్పందించలేదంటూ నిరసనగా […]

రాజ్‌భవన్‌ వద్ద టీటీడీపీ ధర్నా... అరెస్ట్‌లు
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మంత్రి తలసాని వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేయకుండా రాజ్యాంగ విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తన పదవికి రాజీనామా చేశానని చెప్పి మోసం చేసిన తలసాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్‌ నరసింహన్‌ సరిగా స్పందించలేదంటూ నిరసనగా రాజ్‌భవన్‌లోనే టీటీడీపీ నేతలు బైఠాయించి ధర్నా చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇంతకుముందు కూడా తాము తలసాని శ్రీనివాస యాదవ్‌పై ఫిర్యాదు చేశామని, ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్‌ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవిని అనుభవిస్తున్న తలసానిపై చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్దమని వారన్నారు. తలసానిపై చర్యలు తీసుకోవడంలో గవర్నర్‌ నరసింహన్‌ విఫలమయ్యారని వారన్నారు. గవర్నర్‌కు ఎన్నిసార్లు చెప్పినా ప్రజాస్వామ్యానికి న్యాయం చేయడం లేదని, సరిగా స్పందించడం లేదని అంటూ రాజ్‌భవన్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
First Published:  21 July 2015 11:37 AM IST
Next Story