Telugu Global
Cinema & Entertainment

చంద్రబాబు కోసం శ్రీమంతుడు

శ్రీమంతుడు ట్రయిలర్ చూసినవాళ్లకు ఎవరికైనా కథ ఏంటనే విషయం అర్థమైపోతుంది. ఆ కథను దర్శకుడు కొరటాల శివ తెరపై ఎలా ప్రజెంట్ చేశాడనే ఆసక్తి మాత్రమే మిగిలింది. ఓ బిలియనీర్ ఓ ఊరిని దత్తత తీసుకుని, అక్కడి ప్రజలకు, ఆ ఊర్లోని ఓ కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడనేది బేసిక్ లైన్. ఈ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఓ కార్యక్రమానికి దగ్గరగా ఉంది. అదే స్మార్ట్ విలేజ్. ఏపీలో గ్రామాల్ని దత్తత తీసుకోమంటూ ఈమధ్య నారా లోకేష్ […]

చంద్రబాబు కోసం శ్రీమంతుడు
X
శ్రీమంతుడు ట్రయిలర్ చూసినవాళ్లకు ఎవరికైనా కథ ఏంటనే విషయం అర్థమైపోతుంది. ఆ కథను దర్శకుడు కొరటాల శివ తెరపై ఎలా ప్రజెంట్ చేశాడనే ఆసక్తి మాత్రమే మిగిలింది. ఓ బిలియనీర్ ఓ ఊరిని దత్తత తీసుకుని, అక్కడి ప్రజలకు, ఆ ఊర్లోని ఓ కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడనేది బేసిక్ లైన్. ఈ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఓ కార్యక్రమానికి దగ్గరగా ఉంది. అదే స్మార్ట్ విలేజ్. ఏపీలో గ్రామాల్ని దత్తత తీసుకోమంటూ ఈమధ్య నారా లోకేష్ విదేశాల్లో కూడా పర్యటించారు. స్మార్ట్ విలేజ్ పర్యటనలో భాగంగా గ్రామాల్ని దత్తత తీసుకోమని పిలుపునిచ్చారు. అటు ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో కొంతమంది ఎంపీలు కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాను ఏపీ సీఎం చంద్రబాబుకు చూపించే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. సీఎం ఎపాయంట్ మెంట్ కోసం ప్రయత్నిస్తోంది. కుదిరితే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా శ్రీమంతుడు చిత్రాన్ని చూపించాలనుకుంటోంది.
First Published:  21 July 2015 1:30 AM IST
Next Story