Telugu Global
Others

కొవ్వును క‌రిగించే గుమ్మ‌డి!

గుమ్మడి కాయను వివిధ వంట‌ల‌లో వినియోగిస్తుంటారు. ర‌క‌ర‌కాల జ్యూస్‌ల‌లోనూ, సూప్‌గానూ దీనిని ఉప‌యోగిస్తారు. దీనికి అనేక రోగాలను నివారించే గుణం ఉంది. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా ఉప‌యోగాలున్నాయి. చైనావారు సుగ‌ర్ నియంత్రించే ఔష‌ధాల‌లో గుమ్మ‌డిని ఉప‌యోగిస్తున్నారు. గుమ్మ‌డిలో బీటా కెరోటిన్ పుష్క‌లంగా ఉంటుంది , శరీరానికి తక్కువ‌ క్యాలరీలు అందిస్తుంది. కళ్ళకు ,చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా స‌మృద్ధిగా లభిస్తుంది.  డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి దానిని […]

కొవ్వును క‌రిగించే గుమ్మ‌డి!
X
గుమ్మడి కాయను వివిధ వంట‌ల‌లో వినియోగిస్తుంటారు. ర‌క‌ర‌కాల జ్యూస్‌ల‌లోనూ, సూప్‌గానూ దీనిని ఉప‌యోగిస్తారు. దీనికి అనేక రోగాలను నివారించే గుణం ఉంది. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా ఉప‌యోగాలున్నాయి. చైనావారు సుగ‌ర్ నియంత్రించే ఔష‌ధాల‌లో గుమ్మ‌డిని ఉప‌యోగిస్తున్నారు. గుమ్మ‌డిలో బీటా కెరోటిన్ పుష్క‌లంగా ఉంటుంది , శరీరానికి తక్కువ‌ క్యాలరీలు అందిస్తుంది. కళ్ళకు ,చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా స‌మృద్ధిగా లభిస్తుంది. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి దానిని అదుపులో ఉంచుకునేందుకు గుమ్మ‌డి ఉప‌యోగ‌ప‌డుతుంది. బి.పి.ని నియంత్రిస్తుంది. పీచు ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంబంధ‌ వ్యాదులు తగ్గుతాయి. ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూసుకుంటే మంచిది. గుమ్మడి విత్తనాలు తింటే ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
First Published:  21 July 2015 7:00 AM IST
Next Story