ప్రత్యూష డిశ్చార్జ్ అయిన వెంటనే హైకోర్టులో హాజరు పరచండి
ప్రత్యూష ఆరోగ్యం మెరుగై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత హైకోర్టులో హాజరు పరచాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రత్యూష తరహా బాధిత బాలికలు, యువతుల ఉదంతాలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వారి విషయంలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్నికూడా ఆదేశించింది. కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూషను మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచాలని డాక్టర్లు చెప్పినందువల్ల ఆమెను కోర్టు ముందు హాజరుపరచలేక పోయామని […]
BY sarvi20 July 2015 6:40 PM IST
sarvi Updated On: 21 July 2015 5:42 AM IST
ప్రత్యూష ఆరోగ్యం మెరుగై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత హైకోర్టులో హాజరు పరచాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రత్యూష తరహా బాధిత బాలికలు, యువతుల ఉదంతాలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వారి విషయంలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్నికూడా ఆదేశించింది. కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూషను మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచాలని డాక్టర్లు చెప్పినందువల్ల ఆమెను కోర్టు ముందు హాజరుపరచలేక పోయామని ప్రభుత్వ లాయర్ ధర్మాసనానికి వివరించారు. ప్రత్యూషను సీఎం కేసీఆర్ పరామర్శించారని ఆయన కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన ధర్మాసనం ప్రత్యూషను సీఎం పరామర్శించిన సమయంలో కొన్ని విషయాలు చెప్పినట్లు పత్రికల్లో కథనాల్లో వచ్చాయని, అవి వాస్తవమేనని నమ్ముతున్నామని వ్యాఖ్యానించారు. ఈ అంశాలు నిజమే అయితే, ప్రత్యూషను ఎక్కడకు పంపాలి, ఆమె బాగోగులు ఎవరు చూడాలనే ఆందోళనలకు సమాధానం దొరికినట్లేనని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి.బొసాలేతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
Next Story