జర నవ్వండి ప్లీజ్ 150
జాగ్రత్త “అదేంటండీ? డాక్టర్‌గారు వేసుకోమన్న ఆ పెద్ద మాత్రను అలా సైడ్స్ చాకుతో కోసేసి వేసుకుంటున్నారు?” అడిగింది భార్య. “సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ రాకుండా ఉంటాయని” బదులిచ్చాడు ఆ భర్త. ——————————————————————— పెళ్లి కబుర్లు భార్య: ఏమండీ! మన పెళ్లి ఐదురోజులు ఘనంగా జరిపించిన పేరయ్యశాస్త్రి నిన్న రాత్రి చనిపోయాట్ట! భర్త: అనుకుంటాం గాని డార్లింగ్! చేసిన పాపం ఊరికేపోతుందా…?! ——————————————————————— టాప్‌ర్యాంక్ వెంకట్: మీ వాడు ఇంటి రూప్ మీద కూచుని ఎందుకు చదువుకుంటున్నాడు? వేణు: […]
జాగ్రత్త
“అదేంటండీ? డాక్టర్‌గారు వేసుకోమన్న ఆ పెద్ద మాత్రను అలా సైడ్స్ చాకుతో కోసేసి వేసుకుంటున్నారు?” అడిగింది భార్య.
“సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ రాకుండా ఉంటాయని” బదులిచ్చాడు ఆ భర్త.
———————————————————————
పెళ్లి కబుర్లు
భార్య: ఏమండీ! మన పెళ్లి ఐదురోజులు ఘనంగా జరిపించిన పేరయ్యశాస్త్రి నిన్న రాత్రి చనిపోయాట్ట!
భర్త: అనుకుంటాం గాని డార్లింగ్! చేసిన పాపం ఊరికేపోతుందా…?!
———————————————————————
టాప్‌ర్యాంక్
వెంకట్: మీ వాడు ఇంటి రూప్ మీద కూచుని ఎందుకు చదువుకుంటున్నాడు?
వేణు: మా వాడికి “టాప్”రాంక్ తెచ్చుకోవాలని పట్టుదల
———————————————————————
తికమక
టీచర్: రాముడెవరు!
విద్యార్థి: దశరథుని కొడుకు
టీచర్: దశరథుడెవడు?
విద్యార్థి: రాముని తండ్రి. ఏవైనా కష్టమయిన ప్రశ్నలడగండి టీచర్!
———————————————————————
అసాధ్యుడు
చింటు: ఇప్పుడే నాకు రోడ్డు మీద యాభై పైసలు దొరికాయి
మింటు: అది నాదే. రెండు నిముషాల క్రితం యాభైపైసల కాయిన్ పడేసుకున్నా
చింటు: కానీ నాకు రెండు 25 పైసల బిళ్లలు దొరికాయి
మింటు: అవును అది కింద పడినప్పుడే రెండు ముక్కలైంది.