గోవా నీటి ప్రాజెక్టుల అవినీతిపై సీబీఐ విచారణ
యూపీఏ హయంలో ఒక మంత్రి, కొంతమంది అధికారులు అమెరికా కంపెనీ వద్ద ముడుపులు తీసుకొని నీటి ప్రాజెక్టులను కట్టబెట్టిన వ్యవహారంపై సీబీఐతో న్యాయ విచారణ జరపాలని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ డిమాండ్ చేశారు. న్యూజెర్సీకి చెందిన లూయిస్ బెర్గర్ అనే నిర్మాణ కంపెనీకి యుపీఏ హయాంలో గోవా, గౌహతిలో రెండు నీటి ప్రాజెక్టులు దక్కాయి. అందుకు ప్రతిఫలంగా అప్పటి మంత్రికి, అధికారులకు లూయిస్ కంపెనీ భారీగా లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది. […]
BY sarvi20 July 2015 6:42 PM IST
sarvi Updated On: 21 July 2015 8:56 AM IST
యూపీఏ హయంలో ఒక మంత్రి, కొంతమంది అధికారులు అమెరికా కంపెనీ వద్ద ముడుపులు తీసుకొని నీటి ప్రాజెక్టులను కట్టబెట్టిన వ్యవహారంపై సీబీఐతో న్యాయ విచారణ జరపాలని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ డిమాండ్ చేశారు. న్యూజెర్సీకి చెందిన లూయిస్ బెర్గర్ అనే నిర్మాణ కంపెనీకి యుపీఏ హయాంలో గోవా, గౌహతిలో రెండు నీటి ప్రాజెక్టులు దక్కాయి. అందుకు ప్రతిఫలంగా అప్పటి మంత్రికి, అధికారులకు లూయిస్ కంపెనీ భారీగా లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది. కంపెనీపై నమోదైన అభియోగాల పరిష్కారానికి 17.3 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు లూయిస్ కంపెనీ అంగీకరించింది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టుల అవినీతి వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. ఈ కేసు అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించినది కనుక గోవా పోలీసులు ఈ కేసును చేపట్టలేరు. అందువల్ల ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా కలుగ చేసుకొని సీబీఐ విచారణకు ఆదేశించాలని గోవా ముఖ్యమంత్రి కోరారు. కేంద్రమంత్రి పారికర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, అమెరికా కంపెనీకి ప్రాజెక్టులు కట్టబెట్టడంలో ఒకరి కంటే ఎక్కువ మంది మంత్రులకు ముడుపులు అందాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్రం సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తుందని ఆయన చెప్పారు.
Next Story