వర్మ వెటకారం ముదురుతున్నట్లుంది..!
ఏదో రకంగా న్యూస్ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ సిద్ద హస్తుడు. సినిమాలు చేస్తున్నప్పుడు ప్రచారం రూపంలో న్యూస్ క్రియేట్ చేయంలో సిద్ద హస్తుడు. ఈ మధ్య సినిమాలకంటే సోషల్ నెట్ వర్క్ లో తనదైన మార్క్ వ్యాఖ్యలు చేస్తూ బిజీ అయ్యారు. బాహుబలి చిత్రం విడుదలైనప్పుడు.. టాలీవుడ్ ఇండస్ట్రీ ..ఇక్కడ స్టార్ హీరోల పరిస్థితి ..బాలీవుడ్ తరువాత వీళ్లందరు .. రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తే.. వీళ్ల కెరీర్ అంతే సంగతులు అని వ్యాఖ్యనించారు. ఇక […]
ఏదో రకంగా న్యూస్ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ సిద్ద హస్తుడు. సినిమాలు చేస్తున్నప్పుడు ప్రచారం రూపంలో న్యూస్ క్రియేట్ చేయంలో సిద్ద హస్తుడు. ఈ మధ్య సినిమాలకంటే సోషల్ నెట్ వర్క్ లో తనదైన మార్క్ వ్యాఖ్యలు చేస్తూ బిజీ అయ్యారు. బాహుబలి చిత్రం విడుదలైనప్పుడు.. టాలీవుడ్ ఇండస్ట్రీ ..ఇక్కడ స్టార్ హీరోల పరిస్థితి ..బాలీవుడ్ తరువాత వీళ్లందరు .. రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తే.. వీళ్ల కెరీర్ అంతే సంగతులు అని వ్యాఖ్యనించారు.
ఇక ఈ చిత్రం తరువాత వర్మ ఫోకస్ అంతా మెగా హీరోలపైనే పడింది. చిరంజీవి 150 సినిమాను తెలుగులో ఎవరు డైరెక్ట్ చేయలరని.. చేస్తే గీస్తే చిరంజీవే తన సినిమాను తాను డైరెక్ట్ చేసుకోవాలని.. లేదంటే పవణ్ కళ్యాణ్ డైరెక్ట్ చే్స్తేనే బాహుబలిని మించిన చిత్రం వస్తుందని ట్విట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో చిరంజీవి సినిమా వస్తే అంతకు మించిన పెద్ద చిత్రం ఉంటుందా అని తను మెగా ఫ్యాన్స్ ను ప్రశ్నిస్తున్నట్లు ఆయన ట్విట్ చేసి.. మెగా హీరోలతో పాటు.. మెగా ఫ్యాన్స్ ను కూడా కవ్విస్తున్నారు మరి.ఇది కాస్త ముదురు తుంది అంటున్నారు పరిశీలకులు