వర్శిటీల బోధనేతర సిబ్బందికీ పదో పీఆర్సీ
తెలంగాణలోని యూనివర్శీటీల్లో పని చేస్తున్న బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీని వర్తింప చేయడంతో పాటు ప్రభుత్వ పెన్షనర్లందరికీ గ్రాట్యుటీని 8 లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఫైలుపై ఆదివారం సంతకం చేయడంతో సోమవారం జీవో విడుదల చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 13 వర్శిటీల్లో పని చేస్తున్న 15 వేల మంది సిబ్బంది లబ్ది పొందనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పదవీ విరమణ […]
BY admin19 July 2015 6:36 PM IST
admin Updated On: 20 July 2015 6:16 AM IST
తెలంగాణలోని యూనివర్శీటీల్లో పని చేస్తున్న బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీని వర్తింప చేయడంతో పాటు ప్రభుత్వ పెన్షనర్లందరికీ గ్రాట్యుటీని 8 లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఫైలుపై ఆదివారం సంతకం చేయడంతో సోమవారం జీవో విడుదల చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 13 వర్శిటీల్లో పని చేస్తున్న 15 వేల మంది సిబ్బంది లబ్ది పొందనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 12 లక్షలు గ్రాట్యుటీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది. పదో పీఆర్సీ చేసిన సిఫారసులను యథాతథంగా ఆమోదించినందుకు ఉద్యోగ సంఘాలు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
Next Story