జాతీయ జెండాను పాఠ్య పుస్తకాల్లో ముద్రిస్తాం
పాఠ్యపుస్తకాల్లో జాతీయ గీతం, ప్రతిజ్ఞల మాదిరిగానే జాతీయ జెండాను కూడా తప్పనిసరిగా ముద్రించాలనే ముంబై హైకోర్టు తీర్పును శిరసావహిస్తామని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి తెలిపారు. గత ఏడాది మార్చిలో ముంబై హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పుస్తకాల్లో జాతీయ జెండాన్ని ముద్రించే అంశంపై సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించిందని ఆయన తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ తో తయారు చేసిన జాతీయ జెండాల కొనుగోలు, అమ్మకాలు, ఉపయోగంపై నిషేధం విధించడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. […]
BY admin19 July 2015 1:06 PM GMT
X
admin Updated On: 20 July 2015 12:57 AM GMT
పాఠ్యపుస్తకాల్లో జాతీయ గీతం, ప్రతిజ్ఞల మాదిరిగానే జాతీయ జెండాను కూడా తప్పనిసరిగా ముద్రించాలనే ముంబై హైకోర్టు తీర్పును శిరసావహిస్తామని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి తెలిపారు. గత ఏడాది మార్చిలో ముంబై హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పుస్తకాల్లో జాతీయ జెండాన్ని ముద్రించే అంశంపై సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించిందని ఆయన తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ తో తయారు చేసిన జాతీయ జెండాల కొనుగోలు, అమ్మకాలు, ఉపయోగంపై నిషేధం విధించడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. రిపబ్లిక్, స్వాతంత్ర్య దినోత్సవాల సమయంలో రోడ్లు, కాలవలపై ప్లాస్లిక్ జెండాలు వేలాడుతున్నాయని హోంశాఖకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటి తయారీ, ఉపయోగంపై త్వరలో నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు.
Next Story