ఆధార్‌తో ఓటర్ కార్డు లింక్ లేదంటే ఓటు లేనట్లే: కేసీఆర్
హైదరాబాద్ నగరంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ తమ ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించుకోవలసిందేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఓటు వేసే అవకాశం ఉండదని విస్పష్టంగా ప్రకటించారు. నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు […]
హైదరాబాద్ నగరంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ తమ ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించుకోవలసిందేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఓటు వేసే అవకాశం ఉండదని విస్పష్టంగా ప్రకటించారు. నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ లింకేజీపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన కంటే ముందే ఓటర్ల జాబితా సిద్ధం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోనే ఎక్కువ బోగస్ ఓటర్లు ఉండే అవకాశం ఉందని, ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకుంటే ఓటు హక్కు ఉండదని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తొలుత హైదరాబాద్‌లో ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం చేస్తామని, ఆ తర్వాత రాష్ట్ర మంతటా ఆధార్ అనుసంధానం కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.