శ్రీమంతుడు ట్రైలర్ లో చాల చెప్పారు..!
ట్రైలర్ అనేది సినిమా బ్రీఫ్ గా ఎలా ఉండ బోతుందో చూపించే ఒక కోర్ ఎలిమెంట్. రెండు నర గంటల కథ చెప్పడం ఒకెత్తు అయితే.. టోటల్ సినిమాలో మెయిన్ పాయింట్స్ ను బ్రీఫ్ గా రెండు నిముషాల ట్రైలర్ లో చూపించడం అనేది రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్. ఎవరెన్ని చెప్పినా.. సినిమా పై ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి.. ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించేది మాత్రం ట్రైలరే అని చెప్పాలి. ఇక […]
BY admin20 July 2015 1:00 AM IST
X
admin Updated On: 20 July 2015 10:31 AM IST
ట్రైలర్ అనేది సినిమా బ్రీఫ్ గా ఎలా ఉండ బోతుందో చూపించే ఒక కోర్ ఎలిమెంట్. రెండు నర గంటల కథ చెప్పడం ఒకెత్తు అయితే.. టోటల్ సినిమాలో మెయిన్ పాయింట్స్ ను బ్రీఫ్ గా రెండు నిముషాల ట్రైలర్ లో చూపించడం అనేది రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్. ఎవరెన్ని చెప్పినా.. సినిమా పై ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి.. ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించేది మాత్రం ట్రైలరే అని చెప్పాలి. ఇక ట్రైలర్ కట్ చేయించడంలో డైరెక్టర్ టాలెంట్ కూడా తోడు కావాల్సిందే.
శ్రీమంతుడు థియేటరికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక బిలియినీర్.. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని .. సొంత గ్రామానికి కొంతైన చేయాలని తపించే వ్యక్తిగా చూపించారు. అలాగే తండ్రి, కొడుకుల మధ్య ఆలోచన గ్యాప్ ను హైలెట్ చేశారు. హీరోయిన్ శృతి హాసన్ కేవలం గ్లామర్ డాల్ కాదని చెప్పారు. సాంగ్స్ అద్భుతుంగా వుంటాయని రామ రామ సాంగ్ తో చూపించారు. యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయని మిర్చి చిత్రంలో విలన్ గా చేసిన సంపత్ రాజ్ డైలాగ్ తో చూపించారు. మొత్తం మీద మిర్చి తరహా లో దర్శకుడు కొరటాల శివ శ్రీమంతుడు సినిమాను చెక్కినట్లు అర్ధం అవుతుంది. మొత్తం మీద ట్రైలర్ తో మంచి మార్కులే కొట్టేశారు మరి.
Next Story