ఈవ్ టీజింగ్ ఫిర్యాదీపై 35 కత్తిపోట్లు
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ఆడపిల్లలకు రక్షణ లేదని మరోసారి రుజువైంది. ఈవ్ టీజింగ్‌ను వ్యతిరేకించినందుకు పంతొమ్మిదేళ్ల బాలికను దుండుగులు 35 సార్లు కత్తితో పొడిచి పారిపోయారు. కత్తిపోట్లకు గురైన ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఢిల్లీలోని ఆనంద్ పర్‌భాట్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం పంతొమ్మిదేళ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడి ఉండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై […]
BY admin20 July 2015 8:31 AM IST
X
admin Updated On: 20 July 2015 8:31 AM IST
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ఆడపిల్లలకు రక్షణ లేదని మరోసారి రుజువైంది. ఈవ్ టీజింగ్‌ను వ్యతిరేకించినందుకు పంతొమ్మిదేళ్ల బాలికను దుండుగులు 35 సార్లు కత్తితో పొడిచి పారిపోయారు. కత్తిపోట్లకు గురైన ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఢిల్లీలోని ఆనంద్ పర్‌భాట్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం పంతొమ్మిదేళ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడి ఉండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేసి విచక్షణారహితంగా కత్తితో పొడిచారు. సుమారు 35 సార్లు ఆమెను దుండుగులు కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రమాద స్థలంలోనే మరణించిందని తెలిపారు. అయితే, ఆ ఇద్దరు యువకులు గతంలో పలుమార్లు ఈవ్ టీజింగ్ చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కక్షతోనే వారు యువతిని హత్య చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారిపై చర్యలూ తీసుకుని ఉంటే యువతి హత్యకు గురయ్యేది కాదని బంధువులు వాపోయారు. ఇద్దరు యువకులపై పోలీసులకు హత్యానేరం నమోదు చేసి అరెస్టు చేశారు.
Next Story