అక్షర'కు అప్పుడే నటించాలన్న కోరిక కలిగిందట..
అక్షర హాసన్…ఇంట్లో ముగ్గురు సినిమా ఆర్టిస్ట్ లు. తండ్రి కమల్ హాసన్ లోక నాయకుడు. తల్లి సారిక మంచి నటి. అక్క శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్. ఇలా ముగ్గురు కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఎవరికైన స్క్రీన్ మీద కనిపించకుండ ఉండాలనిపిస్తుంది. అక్షరా హాసన్ విషయంలో అదే జరిగింది. కమల్ చిన్న కూతురిగా షమితాబ్ తో ఎంట్రి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. నటిగా ప్రయోగాలు చేయడానికి సిద్దమట. స్టైల్ , ఫ్యాషన్ […]
BY admin19 July 2015 7:03 PM
X
admin Updated On: 20 July 2015 1:38 AM
అక్షర హాసన్…ఇంట్లో ముగ్గురు సినిమా ఆర్టిస్ట్ లు. తండ్రి కమల్ హాసన్ లోక నాయకుడు. తల్లి సారిక మంచి నటి. అక్క శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్. ఇలా ముగ్గురు కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఎవరికైన స్క్రీన్ మీద కనిపించకుండ ఉండాలనిపిస్తుంది. అక్షరా హాసన్ విషయంలో అదే జరిగింది. కమల్ చిన్న కూతురిగా షమితాబ్ తో ఎంట్రి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. నటిగా ప్రయోగాలు చేయడానికి సిద్దమట. స్టైల్ , ఫ్యాషన్ అంటే చెవి కోసుకునే అక్షరా హాసన్..అవకాశమొస్తే.. తనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పించగల నటులెవరితోనైనా ..ఏ భాషలోనైనా తను నటించడానికి సిద్దమట.
విచిత్రం ఏమిటంటే..ఇంటిలో సినిమా వాతావరణం వున్నప్పటికి.. అక్షరా హాసన్ కు ఓసారి ముంబైలో స్నేహితుడు తీసిన నాటకంలో నటించిందట. అప్పుడే సినిమాల్లో నటించాలన్న కోరిక కలిగిందట. ఇక తన స్వభావం గురించి చెప్పింది. తనకు స్ట్రయిట్ ఫార్వర్డ్ గా వుండే వాళ్లే నచ్చుతారట. నిరుత్సహాంగా..ఏదో పోగొట్టుకున్నట్లుంటే వాళ్లంటే అసలు నచ్చదట. మరి నటనలో ఇప్పడిప్పుడే అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఏ రేంజ్ నటి అవుతుందో తెలియాలంటే.. కొంత ఆగాల్సిందే.
Next Story