ఏసీబీ విచారణలో లోకేష్ ఫ్రెండ్స్
ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుమారుడు లోకెష్ స్నేహితులు ఇపుడు ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. లోకేష్ ప్రధాన అనుచరుడిగా చెబుతున్న ప్రదీప్ చౌదరి, తెలుగు యువత, తెలుగు విద్యార్థి విభాగాలకు చెందిన పుల్లారావు యాదవ్, మనోజ్, సుధీర్‌లతోపాటు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తూ పట్టుబడిన రేవంత్‌రెడ్డి డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డిలకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. వీరంతా ఇపుడు ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఈ మొత్తం వ్యవహారానికి […]
BY Pragnadhar Reddy20 July 2015 5:12 AM IST

X
Pragnadhar Reddy Updated On: 20 July 2015 5:03 PM IST
ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుమారుడు లోకెష్ స్నేహితులు ఇపుడు ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. లోకేష్ ప్రధాన అనుచరుడిగా చెబుతున్న ప్రదీప్ చౌదరి, తెలుగు యువత, తెలుగు విద్యార్థి విభాగాలకు చెందిన పుల్లారావు యాదవ్, మనోజ్, సుధీర్‌లతోపాటు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తూ పట్టుబడిన రేవంత్‌రెడ్డి డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డిలకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. వీరంతా ఇపుడు ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌ను విచారించిన సందర్భంగా వీరి పేర్లు బయటపడినట్టు చెబుతున్నారు. అయితే ఈ కేసులో కీలక భూమిక పోషించిన జిమ్మీ బాబు తప్పించుకు తిరుగుతున్నాడు. 15 రోజులుగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఆయన పట్టుబడలేదు. ఈ మొత్తం డబ్బుల వ్యవహారంలో జిమ్మిబాబుదే అసలు పాత్ర అని ఏసీబీ భావిస్తోంది. అతను దొరికితే కీలక సమచారం లభించే అవకాశం ఉంది.
Next Story