తలసాని రాజీనామా వ్యవహారంలో ఎవరు దోషులు?
తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జంప్ అయి మంత్రి పదవిని అందిపుచ్చుకున్న తలసాని శ్రీనివాసరావు వ్యవహారం ఇపుడు గవర్నర్ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రాజీమానా లేఖ ఎప్పుడో ఇచ్చేశానని తలసాని చెబుతున్నా నిజానికి ఇప్పటి వరకు అది స్పీకర్‌కు చేరలేదు. ఇప్పటిదాకా తలసాని రాజీనామా చేసినట్టు, దాన్ని స్పీకరే పెండింగ్‌లో ఉంచినట్టు ప్రచారం జరిగింది. తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకట రమణారెడ్డి సేకరించిన వివరాలను […]
BY Pragnadhar Reddy19 July 2015 12:47 PM IST
X
Pragnadhar Reddy Updated On: 19 July 2015 1:41 PM IST
తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జంప్ అయి మంత్రి పదవిని అందిపుచ్చుకున్న తలసాని శ్రీనివాసరావు వ్యవహారం ఇపుడు గవర్నర్ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రాజీమానా లేఖ ఎప్పుడో ఇచ్చేశానని తలసాని చెబుతున్నా నిజానికి ఇప్పటి వరకు అది స్పీకర్‌కు చేరలేదు. ఇప్పటిదాకా తలసాని రాజీనామా చేసినట్టు, దాన్ని స్పీకరే పెండింగ్‌లో ఉంచినట్టు ప్రచారం జరిగింది. తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకట రమణారెడ్డి సేకరించిన వివరాలను బట్టి తలసాని టీడీపీ నుంచి పొందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలలేదని వెల్లడైంది. టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయక పోవడం ఇపుడు గవర్నర్ నరసింహన్‌కే ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. తలసాని రాజీనామా వ్యవహారంపై సమాచార హక్కు చట్టం ద్వారా స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకున్నానని, ఆయన రాజీనామా లేఖ తమకు ఇవ్వలేదని స్పీకర్ కార్యాలయం తెలిపిందని గండ్ర మీడియా ముందు చెప్పారు. అసలు రాజీనామా లేఖే అందకుండా తలసానిని మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేయిస్తారన్న దానికి ఇపుడు గవర్నర్ నరసింహన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ రాజీనామా గురించి పార్టీ నాయకులతో చర్చించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గండ్ర చెబుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన తలసాని విషయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి కూడా బాధ్యత వహించాలని అన్నారు. ఈ విషయంలో ఒక్క గవర్నర్‌నే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలను కూడా భాగస్వాములను చేయాలని, వీరందరికి తలసాని మంత్రి పదవి వెలగబెట్టడంలో భాగస్థులను మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు నీతి ఉంటే, సిద్ధాంతపరుడైతే తక్షణమే తలసానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం… కేసీఆర్‌ను తలసాని తప్పుదోవ పట్టించారా? ఏక కేసీఆరే తలసానికి తప్పుడు సలహా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించడం చూస్తే టీఆర్ఎస్ అధినేతకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండదంటే ఎవరూ నమ్మరు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని వాగ్దానం చేసిన గవర్నర్, ముఖ్యమంత్రి కూడా ఆ మాటను విస్మరించారని షబ్బీర్ అలీ అంటున్నారు. గవర్నర్ నరసింహన్ చట్టాన్ని కాపాడే వ్యక్తి.. గత కొన్ని నెలలుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదు అందుతున్నా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తెలంగాణ ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడమేనని షబ్బీర్ అలీ అంటున్నారు. ఏదైనా అంశంపై ఫిర్యాదు వచ్చినప్పుడు గవర్నర్‌గా ఆయన బాధ్యత ఆయన నిర్వహించడం లేదని ఆయన మండిపడ్డారు. తలసాని మంత్రి పదవిలో కొనసాగడంపై ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చట్టాన్ని, గవర్నర్ రాజ్యాంగాన్ని అవమానపరిచారని, అది సరికాదని షబ్బీర్ ఆలీ అన్నారు. తలసాని కూడా రాజ్యాంగాన్ని అవమాన పరిచారని, ఆయనపై 420 కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక గవర్నర్‌గా ఫిర్యాదు వచ్చినప్పుడు విచారణ జరపాల్సిన బాధ్యత నరసింహన్‌కు లేదా? అని షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. గవర్నర్‌కు నీతి, నిజాయితీ ఉంటే ఒక్క నిముషం కూడా ఆ పదవిలో కొనసాగే హక్కులేదని, వెంటనే రాజీనామా చేయాలని, లేదా ఎవరేమి అనుకుంటే నాకేంటి అని అనుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని అన్నారు.
తలసాని రాజీనామా వ్యవహారంపై టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. తలసానిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ రాజీనామా ఉదంతంలో గవర్నర్‌కు కూడా పాత్ర ఉందని అనుమానించాల్సి వస్తుందని రేవంత్ అన్నారు. గవర్నర్ తీసుకునే చర్యను బట్టి ఆయన సచ్ఛీలత ఏంటో తెలుస్తుందన్నారు. తలసానిని రాజకీయాల నుంచే బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రాజీనామా వ్యవహారంలో తప్పంతా స్పీకర్‌దేనని రేవంత్ దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ టీఆర్‌ఎస్ పార్టీ నేతగా మారారని ఆయన విమర్శించారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశిస్తే స్పీకర్ ఆసుపత్రిలో చేరారని ఆయన అన్నారు. అంటే ఒక విధంగా కోర్టు ఆదేశాల్ని కూడా పట్టించుకోకుండా తలసాని వ్యవహారం కొనసాగిస్తున్నారన్న మాట. అంటే ఇపుడు లేఖ అందలేదని చెబుతున్న నేపథ్యంలో తలసాని వ్యవహారంలో ఎవరు బాధ్యులు!
Next Story