పంచాయతీల చేతికి ఉపాథి హామీ
గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉపాథిహామీ పథకాన్ని పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందువలన గ్రామ పంచాయతీలకు మరింత అధికారాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కూలీలకు ఏడాది పొడవునా కనీసం వంద రోజుల పని కల్పించడం ద్వారా గ్రామాల్లో వారికి శాశ్వత వనరులు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. అయితే, ఇటీవల కాలంలో ఉపాథిహామీ శాఖలో […]
గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉపాథిహామీ పథకాన్ని పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందువలన గ్రామ పంచాయతీలకు మరింత అధికారాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కూలీలకు ఏడాది పొడవునా కనీసం వంద రోజుల పని కల్పించడం ద్వారా గ్రామాల్లో వారికి శాశ్వత వనరులు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. అయితే, ఇటీవల కాలంలో ఉపాథిహామీ శాఖలో పని చేస్తున్న 16 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు సమ్మె చేయడంతో ఈ పథక నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్పంచులు, వార్డు మెంబర్లకు అప్పగిస్తే పథకం సక్రమంగా అమలవుతుందని, ఒక రోజ్‌గార్ సేవక్‌ను నియమిస్తే సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది.