కొడంగల్‌లో రేవంత్ ఏం చేస్తున్నారు?
ఓటకు నోటు కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఇది చాలా మంది మెదిలో ప్రశ్న. మే 31న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ను ప్రలోభ పెడుతూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే! నెలరోజుల తరువాత ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. కోర్టు విధించిన షరతుల కారణంగా ఆయన కొడంగల్ విడిచి వెళ్లలేని పరిస్థితి. కానీ, […]
BY Pragnadhar Reddy19 July 2015 5:36 AM IST
X
Pragnadhar Reddy Updated On: 19 July 2015 5:36 AM IST
ఓటకు నోటు కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఇది చాలా మంది మెదిలో ప్రశ్న. మే 31న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ను ప్రలోభ పెడుతూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే! నెలరోజుల తరువాత ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. కోర్టు విధించిన షరతుల కారణంగా ఆయన కొడంగల్ విడిచి వెళ్లలేని పరిస్థితి. కానీ, చంద్రబాబు పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖ రాయడంతో టీఆర్ ఎస్ మండిపడింది. బాబుకు మద్దతుగా మాత్రం విలేకరుల సమావేశం పెట్టాడు. ఓటుకు నోటు కుంభకోణం కేసులో అరెస్టవడంతో రేవంత్‌రెడ్డికి కొడంగల్ మీద పర్యవేక్షణ చేసే సమయం చిక్కలేదు. ఈ సమయంలో టీఆర్ ఎస్ అక్కడ కావాల్సినంత మైలేజీ సంపాదించింది. ఇటీవల ఈసీ కూడా రేవంత్ వీడియోలు కావాలని అడగడంతో రేవంత్ మేల్కొన్నారు. ఒకవేళ తనను అనర్హుడిగా ప్రకటిస్తే.. అమ్మో! ఆ ఆలోచన రాగానే రేవంత్ నియోజకవర్గంపై దృష్టి సారించినట్లు సమాచారం. మండల నేతలతో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తన కేడర్‌ను, అనుచరులు టీఆర్ ఆస్ వైపు ఆకర్షితమవకుండా ఎప్పటికప్పడు వారితో టచ్‌లో ఉంటున్నాడు.మొత్తానికి న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ పుణ్యమాని రేవంత్‌రెడ్డి నియోజకర్గంపై దృష్టి సారించేందుకు కావాల్సినంత సమయం దొరికింది.
Next Story