ఆస్తుల రక్షణ కోసమే కేసీఆర్‌తో జానా కుమ్మక్కు: పాల్వాయి
ప్రతిపక్ష నేతగా హుందాగా, బాధ్యతగా మెలగాల్సిన జానారెడ్డి తన ఆస్తులను రక్షించుకోవడానికి సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కై అసమర్ధ ప్రతిపక్షనేతగా చరిత్రలో నిలిచి పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థనరెడ్డి ఆరోపించారు. శాసనసభలోనూ, వెలుపలా జానారెడ్డి ప్రతిపక్షనేతగా వ్యవహరించడం లేదని సీఎం కేసీఆర్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతకు ఉన్న గౌరవానికి జానారెడ్డి మచ్చ తెచ్చారని, ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని అధిష్టానాన్ని కోరానని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ […]
BY Pragnadhar Reddy18 July 2015 1:06 PM GMT
Pragnadhar Reddy Updated On: 19 July 2015 12:21 AM GMT
ప్రతిపక్ష నేతగా హుందాగా, బాధ్యతగా మెలగాల్సిన జానారెడ్డి తన ఆస్తులను రక్షించుకోవడానికి సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కై అసమర్ధ ప్రతిపక్షనేతగా చరిత్రలో నిలిచి పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థనరెడ్డి ఆరోపించారు. శాసనసభలోనూ, వెలుపలా జానారెడ్డి ప్రతిపక్షనేతగా వ్యవహరించడం లేదని సీఎం కేసీఆర్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతకు ఉన్న గౌరవానికి జానారెడ్డి మచ్చ తెచ్చారని, ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని అధిష్టానాన్ని కోరానని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా కారణమని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అయినా, స్వయంకృతాపరాధం వల్లనే రాష్ట్రంలో అధికారంలోకి రాలేదని పాల్వాయి అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని, టీఆర్ ఎస్ పార్టీ మునిగి పోయే నావ అనీ, టీడీపీని ప్రజలు నమ్మడం లేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
Next Story