జమ్మూ రాజ్యాంగాన్ని మార్చలేం: హైకోర్టు
నూతన చట్టాలను చేసేటప్పుడు జమ్మూ రాజ్యాంగాన్ని పార్లమెంటు గుర్తించాలని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. భారత సమాఖ్యతో కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఒప్పందం చేసుకున్నా, సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నందున సార్వభౌమత్వాన్ని కోల్పోలేదని, దీన్ని సవాల్ చేసేందుకు, ప్రత్యామ్నాయం సూచించేందుకు ఎవరికీ అధికారం లేదని జస్టిస్ ఎంఏ అత్తార్, జస్టిస్ మంగ్రాయ్‌తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 2002లో భారత ప్రభుత్వం రూపొందించిన […]
నూతన చట్టాలను చేసేటప్పుడు జమ్మూ రాజ్యాంగాన్ని పార్లమెంటు గుర్తించాలని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. భారత సమాఖ్యతో కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఒప్పందం చేసుకున్నా, సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నందున సార్వభౌమత్వాన్ని కోల్పోలేదని, దీన్ని సవాల్ చేసేందుకు, ప్రత్యామ్నాయం సూచించేందుకు ఎవరికీ అధికారం లేదని జస్టిస్ ఎంఏ అత్తార్, జస్టిస్ మంగ్రాయ్‌తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 2002లో భారత ప్రభుత్వం రూపొందించిన ఎస్ఏఆర్ఎఫ్, ఏఈఎస్ఐ చట్టాలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.