బీజేపీ టార్గెట్ బీహార్
కేంద్రం ఇచ్చే స్పెషల్ ఆర్థిక ప్యాకేజీ కోసం జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్ వంటి బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామోడీ సర్కార్ దృష్టి మాత్రం బీహార్ పైనే ఉంది. వారం వారం పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా, మోడీ బీహార్‌పై దృష్టి సారించడానికి కారణం అక్కడ త్వరలో ఎన్నికలు ఉండడమే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చి అధికారం చేజిక్కించుకోవాలని మోడీ భావిస్తున్నారు. […]
BY Pragnadhar Reddy18 July 2015 6:38 PM IST
Pragnadhar Reddy Updated On: 19 July 2015 5:57 AM IST
కేంద్రం ఇచ్చే స్పెషల్ ఆర్థిక ప్యాకేజీ కోసం జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్ వంటి బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామోడీ సర్కార్ దృష్టి మాత్రం బీహార్ పైనే ఉంది. వారం వారం పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా, మోడీ బీహార్‌పై దృష్టి సారించడానికి కారణం అక్కడ త్వరలో ఎన్నికలు ఉండడమే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చి అధికారం చేజిక్కించుకోవాలని మోడీ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్థికశాఖ కసరత్తు పూర్తి చేసిందని, త్వరలో బీహార్‌కు ప్రధాని వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే మెగా మిద్యుత్ ప్లాంటు, చమురు శుద్ధి కర్మాగారం విస్తరణతో కూడిన ప్యాకేజీని ప్రకటిస్తారని సమాచారం.
Next Story