వెబ్ కౌన్సెలింగ్‌కు మూడు రంగుల్లో కాలేజీలు
తెలంగాణ విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎంసెట్ 2015లో అర్హత సాధించిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. విద్యార్ధులకు సులువుగా అర్థమయ్యేందుకు వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో పెట్టిన కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి, వాటిని మూడు రంగుల గుర్తులను కేటాయించారు. కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా గుర్తింపు పొందిన 194 కాలేజీలకు లేత ఆకుపచ్చ రంగును కేటాయించారు. ఈ కాలేజీల్లో 82,795 సీట్లు ఉన్నాయి. కోర్టుకు వెళ్లిన 121 కాలేజీల్లో […]
BY sarvi17 July 2015 6:36 PM IST
sarvi Updated On: 18 July 2015 5:35 AM IST
తెలంగాణ విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఎంసెట్ 2015లో అర్హత సాధించిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. విద్యార్ధులకు సులువుగా అర్థమయ్యేందుకు వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో పెట్టిన కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి, వాటిని మూడు రంగుల గుర్తులను కేటాయించారు. కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా గుర్తింపు పొందిన 194 కాలేజీలకు లేత ఆకుపచ్చ రంగును కేటాయించారు. ఈ కాలేజీల్లో 82,795 సీట్లు ఉన్నాయి. కోర్టుకు వెళ్లిన 121 కాలేజీల్లో 54 కాలేజీలను అధికారులు వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చారు. ఇదే క్యాటగిరీలో కొత్తగా తనిఖీల కోసం దరఖాస్తు చేసుకున్న 29 కాలేజీలున్నాయి. ఈ రెండు క్యాటగిరీలకు చెందిన కాలేజీల్లో మొత్తం 27 వేల సీట్లున్నాయి. ఈ కాలేజీలకు లేత నీలిరంగును కేటాయించారు. కోర్టుకు వెళ్లని కాలేజీలకు లేత ఊదారంగును కేటాయించారు. వీటిలో మొత్తం 1830 సీట్లున్నాయి. వీటిలో గుర్తింపు కోసం మళ్లీ తనిఖీలు నిర్వహిస్తారు. లేత ఆకుపచ్చరంగులో ఉన్న కాలేజీలో ప్రవేశాలు కోరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మిగిలిన రంగుల కళాశాలల్లో చేరే విషయాన్ని విద్యార్ధుల విజ్ఞత పైన ఆధారపడి ఉంటుందని జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు తెలిపారు.
Next Story