బాబుకు ఝలకిచ్చిన పీఠాధిపతి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇపుడు అంతా కష్టకాలమే. ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియడం లేదు. ఏ పని చేయాలన్నా అన్నీ ఎదురొస్తున్నాయి. విమర్శలు చుట్టుముడుతున్నాయి. తాజాగా విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర విమర్శలు గుప్పించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్భాటం తప్ప నిర్వహణ విషయంలో ఏ మాత్రం సమర్థవంతంగా వ్యవహరించలేదని అన్నారు. హిందూ సనాతన ఆచారాలను పరిగణన లోకి తీసుకోలేదని విమర్శించారు. మహాకుంభమేళా స్థాయిలో పుష్కరాలను నిర్వహిస్తామని […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇపుడు అంతా కష్టకాలమే. ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియడం లేదు. ఏ పని చేయాలన్నా అన్నీ ఎదురొస్తున్నాయి. విమర్శలు చుట్టుముడుతున్నాయి. తాజాగా విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర విమర్శలు గుప్పించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్భాటం తప్ప నిర్వహణ విషయంలో ఏ మాత్రం సమర్థవంతంగా వ్యవహరించలేదని అన్నారు. హిందూ సనాతన ఆచారాలను పరిగణన లోకి తీసుకోలేదని విమర్శించారు. మహాకుంభమేళా స్థాయిలో పుష్కరాలను నిర్వహిస్తామని ఆరునెలల నుంచి పదేపదే ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వానికి అసలు కుంభమేళాను ఎలా నిర్వహిస్తారనే అంశం గురించి అవగాహన లేనట్టుందని స్వామి వ్యాఖ్యానించారు. పుష్కరాలకు వచ్చే భక్తులను సినిమా టికెట్ల కోసం ఎగబడే జనాలన్నట్లుగా నిర్లక్ష్యంగా చూశారు తప్ప వారి పారవశ్యాన్ని పట్టించుకోలేదని అన్నారు. తొలిరోజు వీఐపీల స్నానం కోసం భక్తులను అంతసేపు నిలిపారని, ప్రచార కండూతి వల్ల భక్తుల ప్రాణాలు పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. పుష్కర వేడుకల నిర్వహణ గురించి హైందవ మత పండితులను గానీ, పీఠాధిపతులను గానీ సంప్రదించిందే లేదని, సలహాలు, సూచనలు తీసుకోలేదని అన్నారు. దానివల్ల గోదావరి పుష్కరాలలో ఆధ్యాత్మిక శోభ లోపించిందని, ఏదో ప్రభుత్వ కార్యక్రమంలా హడావిడిగా సాగిపోతోందని విమర్శించారు.