90 రోజుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా: సుజన
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రంలో చర్చలు 60 శాతం పూర్తయ్యాయని, నెలన్నరలో కొలిక్కి వస్తుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి తెలిపారు. విజయవాడలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఎంపిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో చర్చలు సాగుతున్నాయని వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హోదా కల్పించాల్సి ఉందని వివరించారు. సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరువు నుండి బయటపడేందుకు అవసరమైన చర్యలపై […]
BY admin17 July 2015 1:30 PM GMT
X
admin Updated On: 18 July 2015 6:11 AM GMT
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రంలో చర్చలు 60 శాతం పూర్తయ్యాయని, నెలన్నరలో కొలిక్కి వస్తుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి తెలిపారు. విజయవాడలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఎంపిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో చర్చలు సాగుతున్నాయని వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హోదా కల్పించాల్సి ఉందని వివరించారు. సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరువు నుండి బయటపడేందుకు అవసరమైన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. దీంతోపాటు ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు, అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చ జరిగిందని తెలిపారు.
Next Story