తొక్కిసలాట సర్వసాధారణం... వెంకయ్య ఉవాచ
పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన సర్వ సాధారణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే 27 మంది మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు. దాదాపు ఐదు వందల మంది గాయపడ్డారు. ఇలాంటి ఘోర దుర్ఘటనను అంత తేలిగ్గా ఎలా తీసిపారేస్తారని అడిగిన విలేకరులపైనా ఆయన రుసరుసలాడారట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన చాలా చిన్నదిగా అభివర్ణించడం తెలిసిందే. వెంకయ్యనాయుడు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి […]
BY Pragnadhar Reddy17 July 2015 10:11 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 18 July 2015 12:51 AM GMT
పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన సర్వ సాధారణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే 27 మంది మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు. దాదాపు ఐదు వందల మంది గాయపడ్డారు. ఇలాంటి ఘోర దుర్ఘటనను అంత తేలిగ్గా ఎలా తీసిపారేస్తారని అడిగిన విలేకరులపైనా ఆయన రుసరుసలాడారట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన చాలా చిన్నదిగా అభివర్ణించడం తెలిసిందే. వెంకయ్యనాయుడు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి స్నానఘట్టంలో పుష్కర స్నానం ఆచరించి, పిండిప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తొలిరోజు రాజమండ్రిలో తొక్కిసలాట మరణాల అంశాన్ని విలేకరులు వెంకయ్య వద్ద ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇలాంటి ఘటనలు ప్రతిచోటా జరుగుతూనే ఉంటాయని, దీన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. వాడపల్లిలోని తన వియ్యంకుడు ఇమ్మణ్ణి విష్ణురావు కోరిక మేరకు ఇక్కడ పుష్కర స్నానం ఆచరించినట్లు తెలిపారు. పుష్కర స్నానం గోదావరిలో ఎక్కడ ఆచరించినా ఒక్కటేనన్నారు. ప్రజాజీవనానికి ఎంతగానో ఉపయోగపడే నదులను పుష్కరాల సందర్భంగా పూజించడం గొప్ప విషయమనీ, నదులను పరిరక్షించుకోవాల్సిన అవసరముందనీ అన్నారు. యాత్రికులు క్రమశిక్షణతో పుష్కర స్నానాలు ఆచరించాలన్నారు.
Next Story