లలిత్ మోదీ చేతిలో రాజస్థాన్ రిమోట్ : రాహుల్
రాజస్థాన్‌కు వసుంధరా రాజే నామమాత్రపు ముఖ్యమంత్రి మాత్రమే. అసలు రిమోట్ కంట్రోల్ లలిత్ మోడీ చేతిలో ఉంది, ఆయన లండన్ నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. శుక్రవారం జైపూర్ లో పర్యటించిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ రాజస్థాన్ ప్రభుత్వం పైన, ప్రధాని మోడీ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల ముందు తమది 56 ఇంచుల విశాలమైన ఛాతీ అని చెప్పుకొని తిరిగిన వారిది ఆరు నెలల్లో 5.6 ఇంచులకు తగ్గిస్తామని […]
BY sarvi17 July 2015 6:39 PM IST
sarvi Updated On: 18 July 2015 6:00 AM IST
రాజస్థాన్‌కు వసుంధరా రాజే నామమాత్రపు ముఖ్యమంత్రి మాత్రమే. అసలు రిమోట్ కంట్రోల్ లలిత్ మోడీ చేతిలో ఉంది, ఆయన లండన్ నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. శుక్రవారం జైపూర్ లో పర్యటించిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ రాజస్థాన్ ప్రభుత్వం పైన, ప్రధాని మోడీ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల ముందు తమది 56 ఇంచుల విశాలమైన ఛాతీ అని చెప్పుకొని తిరిగిన వారిది ఆరు నెలల్లో 5.6 ఇంచులకు తగ్గిస్తామని అన్నారు. రైతులు, కూలీలతో కలిసి భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, పార్లమెంటులో ఆ బిల్లును కచ్చితంగా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. అవినీతిపై పోరాడతామని బీరాలు పలికిన ప్రధాని ఇప్పడు కళ్లెదుటే మంత్రులు అవినీతికి పాల్పడినా కళ్లుమూసుకుని ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ కశ్మీర్ పర్యటనలో రాహుల్ బావ రాబర్ట్ వాద్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే రాహుల్ ప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం విశేషం.
Next Story