మీ అభిమానానికి ఎప్పటికి బానిసనే..!
కళా కారులు కావడం అదృష్టం. ఇక సినిమా , హీరో, హీరోయిన్ అయితే ఆ గుర్తింపే వేరే. అది లక్ష జన్మల అదృష్టం అనే చెప్పాలి. ఇక ప్రియాంక చోప్రా లాంటి అందగత్తె స్టార్ హీరోయిన్ అయితే ఏ రేంజ్ ఫాలోయింగ్ వుంటుందో ప్పాలా. నటిగా కెరీర్ మన తెలుగు లో ప్రారంభించింది. దాదాపు 13 సంవత్సరాల క్రితం ఒక తెలుగు సినిమా చేసింది. రెండు వేల సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరిటం కైవసంచేసుకున్న తరువాత నేరుగా తెలుగులో […]
కళా కారులు కావడం అదృష్టం. ఇక సినిమా , హీరో, హీరోయిన్ అయితే ఆ గుర్తింపే వేరే. అది లక్ష జన్మల అదృష్టం అనే చెప్పాలి. ఇక ప్రియాంక చోప్రా లాంటి అందగత్తె స్టార్ హీరోయిన్ అయితే ఏ రేంజ్ ఫాలోయింగ్ వుంటుందో ప్పాలా. నటిగా కెరీర్ మన తెలుగు లో ప్రారంభించింది. దాదాపు 13 సంవత్సరాల క్రితం ఒక తెలుగు సినిమా చేసింది. రెండు వేల సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరిటం కైవసంచేసుకున్న తరువాత నేరుగా తెలుగులో ఆఫర్ వచ్చింది. అయితే ఇప్పట్లో ప్రియాంక చోప్రా ఎవరికి తెలియదు. అయితే మధూర్ బండార్కర్ డైరెక్షన్ లో చేసిన ఫ్యాషన్ చిత్రం ప్రియాంక చోప్రా ను స్టార్ ను చేసింది. ఆ తరువాత బర్ఫీ చిత్రం నటిగా తన ప్రతిభాను ప్రపంచానికి చాటింది. గత యేడాది వచ్చిన మేరికోమ్ తో తనలో వైవిధ్యమైన నటిని అభిమాన ప్రపంచానికి చూపించింది. ప్రస్తుతం బాజీరావు మస్తానీ చిత్రంలో నటిస్తుంది. నటిగా ఆల్ రౌండర్ అని చెప్పడం కరెక్ట్. దాదాపు 50 చిత్రాలు పూర్తి చేసింది. అలాగే తన సెలిబ్రిటి స్టేటస్ ను కొన్ని మంచి పనులకు ఉపయోగిస్తుండటం విశేషం. నటిగా తనకు వచ్చిన గుర్తింపు అంత అభిమానుల చలవే ..వారి ప్రేమ తనను ముందుకు నడిపిస్తుందని తెలిపింది. ఇంతకు సడన్ గా ప్రియాంక చోప్రా గురించి ఇదంత ఎందుకు అంటారా..? ఈ రోజు ఈ హాట్ బ్యూటీ పుట్టని రోజుండోయ్. లెట్స్ విష్ హార్ వెరీ హ్యాపి బర్త్ డే డియర్ ప్రియాంకా…..!