భర్తపై టీడీపీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత తన భర్త శివయ్యపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తను ఇంట్లో లేనప్పుడు వచ్చి పిల్లలపై దౌర్జన్యం చేశాడని, గన్‌మెన్ పీఏ లను బెదిరించాడని ఫోన్లో పాయకరావుపేట త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి విలువైన పత్రాలు తీసుకుపోయేడని, గత కొంతకాలంగా తనను మానసికంగా ఎంతో వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. 14 ఏళ్లుగా భరించానని, ఇక భరించే పరిస్థితి లేదని… సహనం నశించే ఈ ఫిర్యాదు చేస్తున్నానని ఎమ్మెల్యే […]
BY admin18 July 2015 11:53 AM IST
X
admin Updated On: 18 July 2015 1:30 PM IST
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత తన భర్త శివయ్యపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తను ఇంట్లో లేనప్పుడు వచ్చి పిల్లలపై దౌర్జన్యం చేశాడని, గన్‌మెన్ పీఏ లను బెదిరించాడని ఫోన్లో పాయకరావుపేట త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి విలువైన పత్రాలు తీసుకుపోయేడని, గత కొంతకాలంగా తనను మానసికంగా ఎంతో వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. 14 ఏళ్లుగా భరించానని, ఇక భరించే పరిస్థితి లేదని… సహనం నశించే ఈ ఫిర్యాదు చేస్తున్నానని ఎమ్మెల్యే అనిత పోలీసులకు తెలియజేశారు. 14 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అనిత ఇదే పోలీస్‌స్టేష్‌న్లో తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలేమిటో తెలియలేదు. కాగా అనితపై గత డిసెంబర్‌లో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను చెప్పుతో కొట్టారని రామారావు అనే ఓ ప్రైవేట్ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే అనితతోపాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్, ఎంపీటీసీ విశ్వనాథ్‌లపై కేసు నమోదు చేశారు. ఆమె కొంచెం దురుసుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి.
Next Story