మెమెన్ ను ఎలా ఉరితీస్తారు? ఎంపీ అసద్
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై బాంబు పేలుళ్లకేసులో నిందితుడైన మెమెన్‌ను ఎలా ఉరితీస్తారు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొత్త వివాదానికి తెరతీశారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైన వారికి పద్మ అవార్డులు ఇస్తూ కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మక్కా మసీదులో నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఏనాడూ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సిక్కులకు చేసిందేమీ లేదని విమర్శించారు. గతంలోనూ ఆయన […]
BY Pragnadhar Reddy18 July 2015 2:50 AM IST
X
Pragnadhar Reddy Updated On: 18 July 2015 3:13 AM IST
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై బాంబు పేలుళ్లకేసులో నిందితుడైన మెమెన్‌ను ఎలా ఉరితీస్తారు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొత్త వివాదానికి తెరతీశారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైన వారికి పద్మ అవార్డులు ఇస్తూ కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మక్కా మసీదులో నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఏనాడూ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సిక్కులకు చేసిందేమీ లేదని విమర్శించారు. గతంలోనూ ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దేశానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యారు. 1993లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 13 చోట్ల బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆ మారణహోమంలో 250 మంది ప్రజలు దుర్మరణం చెందగా, దాదాపు 1200పైగా గాయపడ్డారు. ఇంతటి మారణహోమానికి పాల్పడిన అసలు సూత్రధారి దావూద్ ఇబ్రహీం దేశం దాటి పారిపోయాడు. దాడిని అమలు చేసి, పోలీసులకు చిక్కిన మెమెన్‌కు టాడా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ నెలాఖరును మెమెన్‌ను ఉరితీసేందుకు మహారాష్ర్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సందర్భంలో దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ మెమెన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఎంపీ అసద్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఎంపీ అసద్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. దేశంలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అమాయక ప్రజలను రెచ్చగొట్టడమేనని మండిపడుతున్నారు. హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛ ఉన్న భారతదేశంలో ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు బడుతున్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు తగవని హితవుపలుకుతున్నారు.
Next Story