చంద్రబాబుకు పోయేకాలం దాపురించింది
పదిరోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న మున్సిపల్ కార్మికులపై లాఠీచార్జి చేయడంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న చంద్రబాబుకు పోయే కాలం వచ్చిందని వామపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన కొనసాగించిన జేఏసీ నేతలు, కార్మికులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ నేత రామకృష్ణ పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్న […]
BY sarvi18 July 2015 5:10 AM IST
X
sarvi Updated On: 18 July 2015 5:10 AM IST
పదిరోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న మున్సిపల్ కార్మికులపై లాఠీచార్జి చేయడంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న చంద్రబాబుకు పోయే కాలం వచ్చిందని వామపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన కొనసాగించిన జేఏసీ నేతలు, కార్మికులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ నేత రామకృష్ణ పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం… వారిపై లాఠీ చార్జి చేయించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ మండిపడింది. కార్మికులకు మద్దతుగా నిల్చిన రాజకీయ నాయకులను అరెస్టు చేయించడాన్ని ఖండించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అది ఒక ప్రకటనలో కోరింది పదిరోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆక్షేపించింది. మున్సిపల్ కార్మికులలో ఎక్కువశాతం దళితులు ఉన్నందునే వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. కనీస వేతనాల కోసం ఆందోళన చేస్తున్న కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు శైలజానాథ్, కొండ్రు మురళి మోహన్ వ్యాఖ్యానించారు.
Next Story