Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 147

ఇష్టం కొత్త కోడలితో అత్తగారు – “చూడు తల్లీ! నాకు దోసెలు, మీ మామయ్యగారికి ఇడ్లీలు, మీ మరిదికి వడలు, మీ బావగారికి పెసరట్లు, మీ ఆయనకు పూరీలు ఇష్టం. మరి నీకేది ఇష్టం?” అని అడిగింది అత్త. “వేరు కాపురం” అంది కోడలు ——————————————————————— ప్రశ్న-జవాబు ప్రశ్న: ఏ ప్లేటు టిఫిన్‌ తినడానికి పనికిరాదో చెప్పు చూద్దాం. జవాబు: నేమ్‌ప్లేటు ——————————————————————— మరియున్నూ… “కొంచెం శాంతంగా ఆలోచిస్తే చాలా మటుకు విడాకులు తప్పిపోతాయి”. అంది లాయర్‌ […]

ఇష్టం
కొత్త కోడలితో అత్తగారు – “చూడు తల్లీ! నాకు దోసెలు, మీ మామయ్యగారికి ఇడ్లీలు, మీ మరిదికి వడలు, మీ బావగారికి పెసరట్లు, మీ ఆయనకు పూరీలు ఇష్టం. మరి నీకేది ఇష్టం?” అని అడిగింది అత్త.
“వేరు కాపురం” అంది కోడలు
———————————————————————
ప్రశ్న-జవాబు
ప్రశ్న: ఏ ప్లేటు టిఫిన్‌ తినడానికి పనికిరాదో చెప్పు చూద్దాం.
జవాబు: నేమ్‌ప్లేటు
———————————————————————
మరియున్నూ…
“కొంచెం శాంతంగా ఆలోచిస్తే చాలా మటుకు విడాకులు తప్పిపోతాయి”. అంది లాయర్‌ ఉష. కొలీగ్‌ నాగేశ్వర్రావ్‌తో.
“అలాగే పెళ్లిళ్లు కూడా” అన్నాడతను కూల్‌గా.
———————————————————————
తాళం
“ఏమండీ నేను పాడతాను. మీరు తాళం వేయరూ” అడిగింది ఆండాళ్లు.
“ఓ ఎస్‌ అలాగే! మొదలెట్టు”
అని ఆవిడ పాట అందుకోగానే లేచి గది బయట గొళ్లెం పెట్టి, తాళం వేసి వెళ్లిపోయాడా భర్త
———————————————————————

First Published:  17 July 2015 6:33 PM IST
Next Story