Telugu Global
Others

వాహ‌నాల‌తో పుష్క‌ర ర‌హ‌దారులు కిటకిట

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో పుష్కర ఘాట్‌లకు వెళ్ళే మార్గాలన్నీ ట్రాఫిక్‌తో కిక్కిరిసి పోయాయి. రాజ‌మండ్రికి వెళ్ళే దారుల‌న్నీ కిక్కిరిసి ఉన్నాయి. ల‌క్ష‌లాది వాహ‌నాలు రోడ్ల‌పైకి రావ‌డంతో ఒక్క‌చోట అనేంటి ఏకంగా రాష్ట్రమంతా పుష్క‌రాలు జ‌రుగుతున్న ప్రాంతాల‌కు వెళ్ళే ర‌హ‌దారుల‌న్నీ కిట‌కిట‌లాడుతున్నాయి. ట్రాఫిక్‌కు ప్ర‌ధాన అడ్డంకిగా మారిన టోల్ ప్లాజాల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఏ టోల్ ప్లాజా వ‌ద్ద కూడా ఫీజు వ‌సూలుకు వాహ‌నాలు నిల‌ప‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆదేశించారు. టోల్‌ప్లాజాల వ‌ద్ద […]

వాహ‌నాల‌తో పుష్క‌ర ర‌హ‌దారులు కిటకిట
X

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో పుష్కర ఘాట్‌లకు వెళ్ళే మార్గాలన్నీ ట్రాఫిక్‌తో కిక్కిరిసి పోయాయి. రాజ‌మండ్రికి వెళ్ళే దారుల‌న్నీ కిక్కిరిసి ఉన్నాయి. ల‌క్ష‌లాది వాహ‌నాలు రోడ్ల‌పైకి రావ‌డంతో ఒక్క‌చోట అనేంటి ఏకంగా రాష్ట్రమంతా పుష్క‌రాలు జ‌రుగుతున్న ప్రాంతాల‌కు వెళ్ళే ర‌హ‌దారుల‌న్నీ కిట‌కిట‌లాడుతున్నాయి. ట్రాఫిక్‌కు ప్ర‌ధాన అడ్డంకిగా మారిన టోల్ ప్లాజాల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఏ టోల్ ప్లాజా వ‌ద్ద కూడా ఫీజు వ‌సూలుకు వాహ‌నాలు నిల‌ప‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆదేశించారు. టోల్‌ప్లాజాల వ‌ద్ద వాహ‌నాల‌ను నియంత్రించ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. విశాఖ నుంచి రాజ‌మండ్రి వెళ్ళే ర‌హ‌దారులు, అలాగే తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని పుష్క‌ర ఘాట్‌ల‌కు దారి తీసే ర‌హ‌దారుల‌న్నీ ట్రాఫిక్ వ‌ల‌యంలో చిక్కుకుని ప్ర‌యాణికులు దిక్కుతోచ‌ని ప‌రిస్థితిని అనుభ‌విస్తున్నారు. రెండు గంట‌ల ప్ర‌యాణానికి ఆరు నుంచి ప‌ది గంట‌లు ప‌డుతోంద‌ని ఆగ్ర‌హంతో కూడిన ఆస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. విశాఖ నుంచి రాజ‌మండ్రి వ‌చ్చే జాతీయ ర‌హ‌దారిలో టోల్ గేట్ ఉన్న ప్ర‌తిచోటా కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజమండ్రి టోల్‌ప్లాజా వద్ద ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే రహదారుల్లో టోల్‌ప్లాజా ఉన్న ప్రతిచోటా మూడు నుంచి పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ-రాజమండ్రి-నర్సాపురం-కొవ్వూరు మధ్య ఉన్న టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో టోల్ ఫీజు వసూలు చేయకుండా వాహనాలను వదిలేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పుష్క‌ర ఘాట్‌ల వ‌ద్ద ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు డ్రోన్ కెమెరాల‌ను వాడుతున్నారు. రాజ‌మండ్రిలో రెండు, భ‌ద్రాచ‌లం, కొవ్వూరుల్లో ఒక్క‌టి చొప్పున ఈ కెమెరాల‌ను ఉప‌యోగిస్తున్నారు.

యుద్ధ ప్రాతిపదికన చర్యలకు కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్ రోడ్లలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రతి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రహదారులపై ట్రాఫిక్ క్రమబద్దీకరణను యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టోల్‌గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా చూడాలని, ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. 24 గంటలు గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని, అధికారులు ఏ నిర్ణయం తీసుకోవలసి వచ్చినా కిందిస్థాయి వారికి అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా కలెక్ట‌ర్లు, ఎస్పీలు అందుబాటులో ఉండాల‌ని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, విజయవాడలకు వెళ్ళే వాహనాలకు ఎల్‌బి నగర్‌, ఉప్పల్ వద్దే ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్ జిల్లాలకు పుష్కర ఘాట్‌లకు వెళ్ళే రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి ఉన్నాయి. వాహనాలన్నీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌లో కదులుతున్నాయి. కాళేశ్వరం వెళ్ళే మార్గంలో పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. భద్రాచలం వెళ్ళే రోడ్లన్నీ కూడా జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. నల్గొండ దగ్గర ట్రాఫిక్ జాం కావడంతో భద్రాచలం పుష్కరాలకు వెళుతున్న వాహనాలను చౌటుప్పల్ వద్దే నిలిపి వేస్తున్నారు. భద్రచలంలో డ్రోన్ కెమెరాను ఉపయోగించి అధికారులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. భద్రాచలం రామయ్య సన్నిధిని ఈ కెమెరాలు ఎంతో అందంగా చిత్రీకరించాయి. ఈ దృశ్యాలను భక్తులకు టీవీల్లో ప్రదర్శిస్తున్నారు.

First Published:  18 July 2015 10:50 AM IST
Next Story