హిందూ దేశమే విహెచ్‌పి లక్ష్యం: తొగాడియా
భారతదేశాన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ విశ్వహిందూ పరిషత్ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చెప్పారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో పర్యటించిన ప్రవీణ్‌తొగాడియా మీడియాతో మాట్లాడుతూ మత మార్పిడులను అడ్డుకోవడంతోపాటు గోపూజలు చేయడం, పేద హిందువులకు ఉచితంగా విద్యా, వైద్యం అందించాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామన్నారు. ముస్లింలు మక్కా వెళ్ళడానికి క్రైస్తవులు వాటికన్ సందర్శించడానికి ఆయా మత సంస్థలు నిధులు ఇస్తున్నాయని, కాని హిందువులకు మాత్రం అలాంటి ఆర్ధిక భరోసా […]
BY admin17 July 2015 7:03 PM IST
X
admin Updated On: 18 July 2015 11:58 AM IST
భారతదేశాన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ విశ్వహిందూ పరిషత్ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చెప్పారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో పర్యటించిన ప్రవీణ్‌తొగాడియా మీడియాతో మాట్లాడుతూ మత మార్పిడులను అడ్డుకోవడంతోపాటు గోపూజలు చేయడం, పేద హిందువులకు ఉచితంగా విద్యా, వైద్యం అందించాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామన్నారు. ముస్లింలు మక్కా వెళ్ళడానికి క్రైస్తవులు వాటికన్ సందర్శించడానికి ఆయా మత సంస్థలు నిధులు ఇస్తున్నాయని, కాని హిందువులకు మాత్రం అలాంటి ఆర్ధిక భరోసా ఎవరూ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. హిందువుల అభివృద్ధికి తాము కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. దేశంలో వంద కోట్ల మంది ఉన్న హిందువులను ఏకతాటి పైకి తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు.
Next Story