ఈద్ ముబారక్... ప్రార్థనలతో మారుమోగిన మసీదులు
పవిత్ర ఉపవాస దీక్షలు ముగిశాయి. నెలవంక దర్శనంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నెల రోజులపాటు కఠిన ఉపవాసాన్ని ఆచరించిన ముస్లిం సోదరులంతా పవిత్ర రంజాన్‌ను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కులమతాలకు అతీతంగా నిరుపేదలు కడుపునిండా తినేలా చూడాలనే రంజాన్ స్ఫూర్తిని చాటుతున్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే పవిత్ర రంజాన్ అందించే సందేశం. అందుకే అంతరాలు తెలియని ఆకలిదప్పుల విలువ తెలుసుకునేందుకు, ప్రపంచానికి చాటి చెప్పేందుకు ముస్లిం సోదరులు 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. అలా 30రోజులు […]
BY admin18 July 2015 9:48 AM IST
X
admin Updated On: 19 July 2015 5:58 AM IST
పవిత్ర ఉపవాస దీక్షలు ముగిశాయి. నెలవంక దర్శనంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నెల రోజులపాటు కఠిన ఉపవాసాన్ని ఆచరించిన ముస్లిం సోదరులంతా పవిత్ర రంజాన్‌ను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కులమతాలకు అతీతంగా నిరుపేదలు కడుపునిండా తినేలా చూడాలనే రంజాన్ స్ఫూర్తిని చాటుతున్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే పవిత్ర రంజాన్ అందించే సందేశం. అందుకే అంతరాలు తెలియని ఆకలిదప్పుల విలువ తెలుసుకునేందుకు, ప్రపంచానికి చాటి చెప్పేందుకు ముస్లిం సోదరులు 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. అలా 30రోజులు కఠిన ఉపవాసం ఆచరించిన ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్‌ను జరుపుకుంటారు. ముస్లిం సోదరులతోపాటు మతాలకతీతంగా అందరూ ఒకరికొకరు ఆలింగనాలతో రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కనిపించిన నెలవంక..
శుక్రవారం సాయంత్రం వేళల్లో వినీలాకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో ప్రపంచంలోని యావత్ ముస్లిం సోదరులు రంజాన్‌ను నేడు జరుపుకుంటున్నారు. ఇటు రువాయత్-ఎ-హిలాల్ కమిటీ కూడా నేడే రంజాన్ అని ప్రకటించటంతో ముస్లిం సమాజం అత్యంత భక్తి పవత్తులతో రంజాన్‌ను నేడు ఘనంగా జరుపుకుంటోంది. మసీదులన్నీ ముస్లిం సోదరుల ప్రార్థనలతో భక్తప్రపత్తులతో నిండిపోయాయి.
శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. ఇరు రాష్ట్రాల సీఎంలు…
రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, ఎన్. చంద్రబాబునాయుడు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌ను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Next Story