బియ్యం అక్రమార్కులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
బియ్యం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకొని బియ్యం దందాపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సీఎంవో ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. నిరుపేదల కోసం ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్ మార్కెట్‌లకు తరలించడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. బియ్యం అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ […]
BY sarvi17 July 2015 6:40 PM IST
sarvi Updated On: 18 July 2015 8:11 AM IST
బియ్యం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకొని బియ్యం దందాపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సీఎంవో ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. నిరుపేదల కోసం ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్ మార్కెట్‌లకు తరలించడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. బియ్యం అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం పేదలకు అందకుండా నడుస్తున్న రాకెట్‌ను అరికట్టడానికి రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం, బోగస్ కార్డులు ఏరివేయడం సహా పలు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేయాలని, అక్రమార్కులపై నిత్యావసర సరుకులు చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
Next Story