Telugu Global
Others

కేంద్రం కోపంగా ఉంది... జాగ్రత్త: ఎంపీలతో బాబు

గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రానికి మాట రానీయకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యులదేనని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. దీనిపై ఇప్పటికే నివేదిక పంపించామని, పార్లమెంటులో చర్చకొస్తే ఎదుర్కొనేలా సభ్యులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ సంఘటనపై కేంద్రస్థాయిలో చర్చ జరిగితే రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదముందని, దీనికితోడు ప్రతిపక్షాలకూ ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన పనులపైనా ప్రశ్నించాలని […]

కేంద్రం కోపంగా ఉంది... జాగ్రత్త: ఎంపీలతో బాబు
X
గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రానికి మాట రానీయకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యులదేనని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. దీనిపై ఇప్పటికే నివేదిక పంపించామని, పార్లమెంటులో చర్చకొస్తే ఎదుర్కొనేలా సభ్యులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ సంఘటనపై కేంద్రస్థాయిలో చర్చ జరిగితే రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదముందని, దీనికితోడు ప్రతిపక్షాలకూ ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన పనులపైనా ప్రశ్నించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలుపై నిలదీయాలని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో జాగ్రత్త పడకపోతే నష్టపోతామన్నారు. ఇప్పటికే ఆర్థిక లోటులో ఉన్న నేపథ్యంలో దీన్ని సాధించు కోకపోతే పరిశ్రమలు రావని, దీనివల్ల రాష్ట్రం నష్టపోతుందని ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు సభ్యులు వ్యవహరించాలని సూచించచారు. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు చేయకపోతే అక్కడ ఆస్తులకు రక్షణ ఉండదని సిఎం అన్నట్లు తెలిసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై గట్టిగా ప్రశ్నించాలని, అదే సమయంలో కేంద్రం నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాల‌ని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుకు, జిఎస్‌టికి, నల్లధనం అంశాల్లో కేంద్రాన్ని సంపూర్ణ మద్దతు ఇవ్వాల‌న్నారు. రైల్వే జోన్‌ మంజూరు చేసినా స్పష్టమైన ప్రకటన రాలేదని, దీనిపైనా కేంద్రంతో చర్చించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, భూ సేకరణ, జిఎస్‌టి, నల్లధనం, జమ్మూకాశ్మీర్‌ సమస్య అంతర్గత భద్రత, నదుల అనుసంధానం, అవినీతి, వ్యవసాయం, పెండింగ్‌ బిల్లుల గురించి పార్లమెంటులో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.
First Published:  18 July 2015 9:26 AM IST
Next Story