Telugu Global
Others

వేం న‌రేంద‌ర్‌రెడ్డిపై బిగిస్తున్న ఏసీబీ ఉచ్చు

ఓటుకు నోటు కేసులో మొద‌టి ముద్దాయి రేవంత్‌రెడ్డిపై ఇప్ప‌టివ‌ర‌కు దృష్టి సారించిన అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) ఇపుడు మ‌రో నాయ‌కుడు వేం న‌రేంద‌ర్ రెడ్డిపై క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌ను విచారించిన ఏసీబీ త‌ర్వాత రెండు రోజుల‌పాటు ఆయ‌న కుమారుడు కృష్ణ కీర్త‌న్‌ను విచారించింది. అంత‌టితో వ‌దిలి వేయ‌కుండా ఆయ‌న‌తోపాటు తిరిగే డ్రైవ‌ర్‌ను, వారి ఇంట్లో ప‌ని చేసే మ‌నిషిని, కేబుల్ ఆప‌రేట‌ర్‌ను, ఆయ‌న స‌హాయ‌కుడు వీర‌భ‌ద్రాన్ని ప్ర‌శ్నిస్తోంది. ఓటుకు నోటు వ్య‌వ‌హారం కొన‌సాగుతున్న‌ప్పుడు వేం […]

వేం న‌రేంద‌ర్‌రెడ్డిపై బిగిస్తున్న ఏసీబీ ఉచ్చు
X

ఓటుకు నోటు కేసులో మొద‌టి ముద్దాయి రేవంత్‌రెడ్డిపై ఇప్ప‌టివ‌ర‌కు దృష్టి సారించిన అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) ఇపుడు మ‌రో నాయ‌కుడు వేం న‌రేంద‌ర్ రెడ్డిపై క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌ను విచారించిన ఏసీబీ త‌ర్వాత రెండు రోజుల‌పాటు ఆయ‌న కుమారుడు కృష్ణ కీర్త‌న్‌ను విచారించింది. అంత‌టితో వ‌దిలి వేయ‌కుండా ఆయ‌న‌తోపాటు తిరిగే డ్రైవ‌ర్‌ను, వారి ఇంట్లో ప‌ని చేసే మ‌నిషిని, కేబుల్ ఆప‌రేట‌ర్‌ను, ఆయ‌న స‌హాయ‌కుడు వీర‌భ‌ద్రాన్ని ప్ర‌శ్నిస్తోంది. ఓటుకు నోటు వ్య‌వ‌హారం కొన‌సాగుతున్న‌ప్పుడు వేం క‌ద‌లిక‌ల‌పై ఆరా తీయ‌డ‌మే వీరంద‌రి విచార‌ణ అని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు వ్య‌వ‌హారం నిజానికి వేం న‌రేంద‌ర్ రెడ్డి కోస‌మే ప్రారంభ‌మైంది. ఈయ‌న ఎమ్మెల్సీగా ఎన్నిక కావ‌డం కోస‌మే మొత్తం రేవంత్‌రెడ్డితోపాటు అంద‌రూ ఈ వ్య‌వ‌హారాన్ని న‌డిపినందున ఎన్నిక కావ‌ల‌సిన స‌మ‌యంలో వేం న‌రేంద‌ర్ రెడ్డి ఎక్క‌డెక్క‌డు తిరిగారో, ఆయ‌న ఇంటికి ఎవ‌రెవ‌రు వ‌చ్చారో తెలుసుకుని విశ్లేషించ‌డానికి ఈ స‌మాచారం ఉప‌క‌రిస్తుంద‌ని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. నిందితుల‌నే కాకుండా ఆయ‌న ప‌రిధిలో ఉండే వ్య‌క్తుల నుంచి సేక‌రించే స‌మాచారం కేసులో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఏసీబీ భావిస్తోంది. వేరువేరు వ్య‌క్తుల నుంచి వ‌చ్చే స‌మాచారంలో ర‌క‌ర‌కాల కోణాలు బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌న్న‌ది ఏసీబీ ఆలోచ‌న. ఇందుకు అనుగుణంగానే ఏసీబీ పావులు క‌దుపుతోంది. వీరి నుంచి రేవంత్‌, ఉదయ్‌ సింహా, సెబాస్టియన్‌లో ఎవరు ఎక్కువగా వేం న‌రేంద‌ర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతుండేవారు.. ఎక్కడ కలుసుకుని మాట్లాడుకునే వారు… అనే అంశాలపై ఆరా తీశారు. తండ్రి రాజకీయ విషయాల్లో కృష్ణ కీర్తన్‌ కలుగజేసుకునేవారా? రేవంత్‌తో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

First Published:  18 July 2015 7:59 AM IST
Next Story