ఆంధ్రా న్యాయమూర్తులు మాకొద్దు: టీఆర్ ఎస్ ఎంపీలు!
ఏపీకి చెందిన న్యాయమూర్తులు తమకు ఎంతమాత్రం అక్కర్లేదని టీఆర్ ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తిచేశారు. వెంటనే ఉమ్మడి హైకోర్టును విభజించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు జితేందర్ రెడ్డి, కవిత, వినోద్, నర్సయ్‌గౌడ్, సీతారాం నాయక్, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో సమావేశమయ్యారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైందని కే కేశవరావు విమర్శించారు. ఆరునెలల్లోపు ఏపీలో […]
ఏపీకి చెందిన న్యాయమూర్తులు తమకు ఎంతమాత్రం అక్కర్లేదని టీఆర్ ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తిచేశారు. వెంటనే ఉమ్మడి హైకోర్టును విభజించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు జితేందర్ రెడ్డి, కవిత, వినోద్, నర్సయ్‌గౌడ్, సీతారాం నాయక్, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో సమావేశమయ్యారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైందని కే కేశవరావు విమర్శించారు. ఆరునెలల్లోపు ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పునుసైతం అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలంటూ గవర్నర్‌కు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ఇటీవలే లేఖలు రాసిన విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించినట్టు కేకే తెలిపారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వెంటనే హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే పార్లమెంట సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టంచేశారు. హైకోర్టు విభజనపై ఏపీ సీఎంతో మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారని కేశవరావు తెలిపారు.